
మరో వారంలో రోజుల్లోనే జనసేన అధినేత నరసాపురంలో ఓ బహిరంగ సభను పెట్టబోతున్న సంగతి తెలిసిందే. ఈ సభలో మంత్రి పేర్ని నానిపై మరియు జగన్ లపై మండిపడే విధంగా వ్యాఖ్యలు చేయనున్నారని సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో కొందరు టాలీవుడ్ పెద్దలు పవన్ కళ్యాణ్ కు ప్రత్యేక రిక్వెస్ట్ చేసినట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఏ విషయం మీద ఆ రిక్వెస్ట్...ఎంతవరకూ నిజం ఉంది చూస్తే...
జనసేన అధినేత మరియు టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై వైసీపీ దాడి పెంచేసింది. తాజాగా మంత్రి పేర్ని నాని చేసిన కామెంట్సే అందుకు సాక్ష్యం. ఒక హీరోగా లేక రాజకీయ నాయకుడిగా పవన్ కళ్యాణ్ అంటే తమకు భయం లేదని కీలక కామెంట్స్ చేసారు. అసలు పవన్ కళ్యాణ్ ఎవరు? మహా అయితే ఏడాదికో సినిమా చేస్తాడు, అందరిలాగానే అతను ఒక స్టార్ హీరో, నిజంగా చెప్పాలంటే ఆయన సినిమాకు అల్లు అర్జున్ సినిమా కంటే ఎక్కువ కలెక్షన్స్ వస్తాయా? అంటూ పవన్ ను కార్నర్ చేసే విధంగా మాట్లాడారు పేర్ని నాని.
అంతేకాకుండా మొన్న మీటింగ్ కు వచ్చిన హీరోలను గుర్తు చేస్తూ... చిరంజీవి, రామ్ చరణ్, మహేష్, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ లు పవన్ కంటే మంచి సినిమాలు చేస్తున్నారు, నా చిన్నప్పుడు ఎపుడో ‘అత్తారింటికి దారేది’ సినిమా ఒక్కటి బాగా ఆడింది, దానిని చూసే ఇప్పటికి తన సినిమాలను అమ్ముకుంటున్నాడు అన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ కంటే తర్వాత వచ్చిన హీరోలు కూడా ప్రస్తుతం ఇండస్ట్రీలో ఆయన కంటే పెద్ద స్థాయిలోనే ఉన్నారు, ఆయన కంటే మంచి సినిమాలే చేస్తున్నారు. ఇంతలా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ పేర్ని నాని చేసిన వ్యాఖ్యలకు పవన్ రిప్లై కాస్త ఘాటుగానే ఇచ్చే అవకాసం ఉంది..అయితే ఇప్పుడు ఆగుతారంటున్నారు.
అయితే ఓ జనసేన అధినేతగా పొలిటికల్ పరంగా వైసీపీపై ఎన్ని విమర్శలు చేసుకున్నా పర్లేదు గానీ, సినీ ఇండస్ట్రీని మాత్రం ముడిపెట్టవద్దని టాలీవుడ్ పెద్దలు విజ్ఞప్తి చేసినట్లుగా కొన్ని మీడియా వర్గాల టాక్. తెలుగు పరిశ్రమ ఎదురు చూస్తోన్న టికెట్ ధరల జీవో బయటకు వచ్చేటంత వరకు టికెట్ ధరల గురించి వైసీపీ సర్కార్ ని పవన్ ఈ విషయంలో ఎటాక్ చేయవద్దని కోరారట.
అదీ ప్రక్కన పెట్టి ఒకవేళ పవన్ ఏదయినా కీలక వ్యాఖ్యలు చేసి వైసీపీని కార్నర్ చేస్తే, టికెట్ ధరల జీవో మరింత లేటు అయితే దానికి ప్రత్యక్షంగా పవనే కారణం అయ్యారన్న విమర్శలు మళ్ళీ ఊపందుకుంటాయి. తెలుగు పరిశ్రమ శ్రేయస్సు దృష్ట్యా టికెట్ ధరల అంశం గురించి పవన్ ప్రస్తావించకపోవచ్చని బలంగా వినిపిస్తోన్న టాక్.
ఇప్పటికే ‘రిపబ్లిక్’పంక్షన్ లో తాను మాట్లాడిన దాని వలనే సమస్య ఇంత పెద్దదైందనే వాదన పవన్ వద్దకు చేరే ఉంటుంది. ఈ దిశగా ఇప్పటికే ఇండస్ట్రీ నుండి పవన్ కు రిక్వెస్ట్ లు కూడా వెళ్లినట్లుగా తెలుస్తోంది. అంటే వైసీపీ ఎంతగా విమర్శలు చేసినా, రెచ్చగొట్టినా, టికెట్ ధరలపై స్పందించకుండా కొద్ది కాలం పవన్ ఆగుతారన్నమాట. ఇందులో నిజమెంత అనేది తెలియాలంటే 20వ తేదీ వరకు వేచిచూడాలి.