
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం రాధే శ్యామ్. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకులని సరికొత్త ప్రేమ లోకంలో ముంచెత్తేందుకు ఈ చిత్రం రెడీ అవుతోంది. కోవిడ్ కారణంగా ఈ చిత్రం పలుమార్లు వాయిదా పడడం చూశాం. ఇప్పటికే ప్రీ రిలీజ్ ఈవెంట్, ట్రైలర్ లాంచ్ అన్నీ జరిగిపోయాయి. సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడింది.
ఏది ఏమైనా సరికొత్తగా ఈ చిత్రం మార్చి 11న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. నేడు వాలెంటైన్స్ డే.. రాధే శ్యామ్ చిత్రం ఫుల్ లవ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతున్న చిత్రం. మరి ఫ్యాన్స్ కి ట్రీట్ లేకుంటే ఎలా ? అందుకునే చిత్ర యూనిట్ ఓ సర్ ప్రైజ్ తో రెడీ అయిపోయింది.
వాలెంటైన్స్ డే కానుకగా నేడు ఈ చిత్రం నుంచి స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ కాబోతోంది. మధ్యాహ్నం 1.43 గంటలకు గ్లింప్స్ రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా బ్యూటిఫుల్ ఫోస్టర్ తో అప్డేట్ ఇచ్చారు. పోస్టర్ మొత్తం పింక్ కలర్ తో నిండిపోయి ఉంది. పూజా హెగ్డే రంగుల పూసుకుని చిరునవ్వుతో కనిపిస్తోంది. ప్రభాస్ మాత్రం దీర్ఘాలోచనలో కనిపిస్తున్నాడు.
ప్రభాస్ ఈ చిత్రంలో హస్తసాముద్రిక నిపుణుడిగా నటిస్తున్నాడు. చేతి గీతాల్ని బట్టి ఎవరి భవిష్యత్తునైనా ఇట్టే చెప్పేసే విక్రమాదిత్యగా ప్రభాస్ కనిపిస్తున్నాడు. మరి తన జీవితంలో, ప్రేమలో ఎటువంటి మలుపులు చోటు చేసుకోబోతున్నాయి.. ఈ విషయాలని ముందే గ్రహించిన ప్రభాస్ ఏం చేయబోతున్నాడు అనేది కథ. చిత్ర యూనిట్ ఈ చిత్రాన్ని విధికి, ప్రేమకి మధ్య జరిగే పోరాటంగా అభివర్ణిస్తున్నారు.
రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. యూవీక్రియేషన్స్ సంస్థ ఈ చిత్రం భారీ బడ్జెట్ లో నిర్మించింది.