
ఈసారి కరోనా మూడో వేవ్ ఫిల్మ్ సెలబ్రిటీలను ముప్పుతిప్పులు పెట్టింది. ఇప్పుడిప్పుడు కరోనా కోరల నుంచి జనం బయటపడుతున్నారు.. ఇప్పుడు కూడా ఫిల్స్ స్టార్స్ లో ఎవరో ఒకరు కరోనా బారిన పడుతూనే ఉన్నారు. రీసెంట్ హీరోయిన్ శ్రుతి హాసన్ (Sruthi Hasan) కు కరోనా సోకింది.
కరోనా కోరల్లో చిక్కకున్న ఫిల్మ్ సెలబ్రిటీల లిస్ట్ లో శ్రుతీ హాసన్ (Sruthi Hasan) కూడా చేరింది. రీసెంట్ గా ఆమె కోవిడ్ బారిన పడింది. గతంలో తన తండ్రి తమిళ స్టార్ హీరో కమల్ హాసన్(Kamal Hasan) కరోనా బారిన పడగా.. ప్రైవేట్ హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకున్నారు. ఆతరువాత హెల్త్ చెకప్ కూడా చేసుకున్నారు కమల్. అయితే రీసెంట్ గా కోవిడ్ బారిన పడిన శృతి హాసన్ (Sruthi Hasan) మాత్రం డాక్టర్ల సలహా మేరకు హోమ్ క్వారంటైన్ లో ఉంటూ.. హోమ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు.
ఇక తాజాగా శృతీ హాసన్(Sruthi Hasan) పోస్ట్ ఒకటి వైరల్ అవుతుంది. కోవిడ్ వల్ల ఇంటికే పరిమితం అయిన శృతీ హాసన్ పై వైరస్ ప్రభావం గట్టిగా చూపించినట్టు ఉంది. రెండు రోజులకే బాగానీరసించిపోయి.. గుర్తు పట్టకుండా అయిపోయింది శ్రుతి. అంతే కాదు ఇంట్లోనే ఉండటం వల్ల తన పరిస్థితి ఇంకా ధారణంగా తయారయ్యిందని.. ఏం చేయాలో తోచడం లేదంటూ ఓ పోస్ట్ ను ఇన్ స్టాలో పెట్టింది శ్రుతి(Sruthi Hasan).
శ్రుతీ హసన్ (Sruthi Hasan) ఒక పట్టాన ఇంట్లో ఉండే రకం కాదు. ఆమెకు ఎప్పుడూ బిజీ వర్క్ ఉండాలి. పనితో పాటు తన ఫ్రెండ్స్.. అండ్ టీమ్ తో సందడి చేసే స్టార్ హీరోయిన్.. ఇంట్లో ఉంలేకపోతోంది. మానసికంగా ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తోంది. అంతే కాదు కోవడ్ లక్షణాల వల్ల ఆమె బాగా నీరసంగా తయారయ్యింది. ఈ పోస్ట్ చూసిన సెలబ్రిటీ స్టార్స్.. శృతీ హాసన్ త్వరగా కోలుకోవాలని కామెంట్లు పెడుతున్నారు. ఫ్యాన్స్ శృతీ (Sruthi Hasan) కోసం ప్రార్ధనలు చేస్తున్నారు.