జైలు నుంచి షారూక్ కి ఆర్యన్ ఖాన్ వీడియో కాల్.. ఏం మాట్లాడాడంటే..!

By telugu news team  |  First Published Oct 16, 2021, 11:39 AM IST

అరెస్ట్ అయిన 12 రోజుల తర్వాత తన తల్లిదండ్రులతో వీడియో కాల్‌లో మాట్లాడేందుకు ఆర్యన్‌ ఖాన్‌కు జైలు అధికారులు అనుమతించారు. ఈ మేరకు జైలు అధికారులు తెలిపారు. దాదాపు పది నిమిషాలపాటు మాట్లాడటం గమనార్హం.


డ్రగ్స్ కేసులో షారూక్ (Sharukh khan)  తనయుడు ఆర్యన్ ఖాన్ (Aryan Khan) ని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.  కాగా.. అధికారుల  అనుమతితో ఆర్యన్ ఖాన్ తన తండ్రి షారూక్ ఖాన్ తో వీడియో కాల్ మాట్లాడాడు. దాదాపు పది నిమిషాల పాటు తన తల్లిండ్రులతో మాట్లాడి.. ఆర్యన్ ఖాన్ ఏడ్చేయడం గమనార్హం. ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో ఉన్న ఆర్యన్ ఖాన్‌కు తల్లిదండ్రులతో మాట్లాడే అవకాశం కల్పించారు. దీంతో షారుఖ్ ఖాన్, గౌరీ ఖాన్ తో ఆర్యన్ ఖాన్ మాట్లాడారు. తల్లిదండ్రులతో మాట్లాడుతూ ఆర్యన్ ఖాన్ కన్నీటి పర్యంతమయ్యారు.

 అరెస్ట్ అయిన 12 రోజుల తర్వాత తన తల్లిదండ్రులతో వీడియో కాల్‌లో మాట్లాడేందుకు ఆర్యన్‌ ఖాన్‌కు జైలు అధికారులు అనుమతించారు. ఈ మేరకు జైలు అధికారులు తెలిపారు. దాదాపు పది నిమిషాలపాటు మాట్లాడటం గమనార్హం.

Latest Videos

undefined

Also Read:IPL2021 Final: బిగ్ ఫైట్ కు అందుబాటులో లేని షారుఖ్ ఖాన్.. కేకేఆర్ అభిమానుల్లో కనిపిస్తున్న వెలితి


గత ఏడాది కరోనా వచ్చినప్పటి నుంచి తమ కుటుంబ సభ్యులు, లాయర్లతో మాట్లాడేందుకు ఖైదీలకు జైలు అధికారులు అవకశామిచ్చారు. కరోనా నెగిటివ్‌గా తేలిన తర్వాత ఆర్యన్ ఖాన్‌ను అర్థర్ రోడ్ జైలులోని క్వారంటైన్ సెల్‌కు ఆర్యన్ ఖాన్‌ను తరలించారు పోలీసులు. అక్కడ ఎన్‌956 నంబర్‌ను ఆర్యన్ ఖాన్‌కు ఇచ్చారు. ఆర్యన్ పూర్తి నిరాశతో ఆందోళనలో ఉన్నట్లు సమాచారం. అందుకే ఇతర ఖైదీలతో కాకుండా ఆర్యన్‌ను భద్రతా కారణాల వల్ల సింగిల్ సెల్‌లో ఉంచుతున్నారు.

Also read:Aryan Khan: ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ లేదు.. వచ్చే వారానికి తీర్పు వాయిదా
ఇంటి భోజనం వద్దని జైలు ఆహారాన్నే ఆర్యన్ స్వీకరిస్తున్నాడు. జైలు నిబంధనల ప్రకారం ఆర్యన్‌కు రూ.4,500 మనీ ఆర్డర్ తన తల్లిదండ్రుల నుంచి వచ్చింది. జైలు క్యాంటిన్లో చిరుతిండ్లు, జ్యూస్ సహా ఇతర ఆహార పదార్థాలను కొనుక్కునేందుకు ఆర్యన్ వీటిని వినియోగించుకోవచ్చు.

click me!