35 రోజుల మిస్టరీ... ఇన్ని రోజులు సాయి ధరమ్ కి అందించిన చికిత్స ఏమిటీ? ఆ ప్రశ్నలకు సమాధానం ఏది?

By team telugu  |  First Published Oct 16, 2021, 9:55 AM IST

డాక్టర్స్ విడుదల చేసిన బులెటిన్ నిజం అయితే, కాలర్ బోన్ ఆపరేషన్ అనంతరం... ఓ వారం లేదా పది రోజుల్లో డిశ్చార్జ్ కావలసింది. గాయం మానే వరకు సాయి ధరమ్ ఇంటి దగ్గర విశ్రాంతి తీసుకున్నా సరిపోతుంది. కానీ అలా జరగలేదు.


వినాయక చవితినాడు ఆసుపత్రి పాలైన సాయి ధరమ్ తేజ్ విజయదశమికి ఇంటికి చేరారు. నిన్న సాయి ధరమ్ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయినట్లు మెగా ఫ్యామిలీ ధృవీకరించింది. Chiranjeevi ఈ విషయాన్ని తెలియజేస్తూ ఎమోషనల్ ట్వీట్ చేశారు. అనుకోని ప్రమాదానికి గురైన సాయి ధరమ్ పూర్తిగా కోలుకొని ఇంటికి వచ్చాడని.. పెద్దమామయ్య, అత్త (చిరంజీవి, సురేఖ) తరపున బెస్ట్ విషెష్ అంటూ ట్వీట్ చేశారు. 


అయితే ప్రమాదం తరువాత Sai dharam tej హెల్త్ కండీషన్ పై అనేక అనుమానాలు ఏర్పడ్డాయి. బైక్ పై నుండి క్రింద పడ్డ సాయి ధరమ్ స్పృహ కోల్పోయారు. మొదట మెడికవర్ హాస్పిటల్ లో ఆయను జాయిన్ చేశారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం అపోలోకు తరలించారు. కొద్దిసేపటి తర్వాత అపోలో వర్గాలు హెల్త్ బులెటిన్ విడుదల చేశాయి. సాయి ధరమ్ ప్రాణాలకు ప్రమాదం లేదని, బాడీలోని ప్రధాన అవయవాలకు ఎటువంటి గాయాలు కాలేదన్నారు. అయితే ఆయన కాలర్ బోన్ ఫ్రాక్చర్ కావడం జరిగింది. శస్త్ర చికిత్స చేస్తే సరిపోతుందని వైద్యులు బులెటిన్ లో వివరించారు. 

Latest Videos

undefined


డాక్టర్స్ విడుదల చేసిన బులెటిన్ నిజం అయితే, కాలర్ బోన్ ఆపరేషన్ అనంతరం... ఓ వారం లేదా పది రోజుల్లో డిశ్చార్జ్ కావలసింది. గాయం మానే వరకు సాయి ధరమ్ ఇంటి దగ్గర విశ్రాంతి తీసుకున్నా సరిపోతుంది. కానీ అలా జరగలేదు. నిన్న డిశ్చార్జ్ అయ్యే నాటికి సాయి ధరమ్ ఏకంగా 35 రోజులు ఆ హాస్పిటల్ లో ఉన్నారు. ఈ పీరియడ్ లో సాయి ధరమ్ కి సంబంధించిన ఒక్క వీడియో లేదా ఫోటో విడుదల చేయలేదు. 

Also read డిశ్చార్జ్ అయిన సాయిధరమ్ తేజ్, బర్త్ డే రోజునే.. ఇది పునర్జన్మ.. చిరు, బన్నీ ట్వీట్
కొద్దిరోజుల క్రితం కోలుకున్నాడన్న అర్థం వచ్చేలా బొటన వేలు పైకి చూపిస్తున్న ఫోటో విడుదల చేశారు. ఆ ఫొటోలో కూడా సాయి ధరమ్ కనిపించలేదు. కాగా పవన్ రిపబ్లిక్ ప్రీ రిలీజ్ వేడుకలో సాయి ధరమ్ ఇంకా కోమాలోనే ఉన్నారని మాటల్లో Pawan kalyan నోరుజారారు. అప్పటికి ప్రమాదం జరిగి రెండు వారాలు అవుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో  అపోలో వైద్యులు విడుదల చేసిన హెల్త్ బులెటిన్ వాస్తవం కాదని మెగా ఫ్యాన్స్ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. 

Also read రామ్‌చరణ్‌-శంకర్‌ సినిమా బిగ్‌ అప్‌డేట్‌.. అసలు కథ రివీల్‌ చేసిన కియారా
35 రోజులు రహస్యంగా చికిత్స అందించాల్సిన అవసరం ఏముంది?. ఇన్ని రోజులలో సాయి ధరమ్ ఫ్యాన్స్ ని ఉద్దేశిస్తూ, తన ఆరోగ్య పరిస్థితి తెలియజేస్తూ.. ఎందుకు ఓ వీడియో కూడా విడుదల చేయలేదు? అని అంటున్నారు. డిశ్చార్జ్ అయిన తరువాత కూడా సాయి ధరమ్ ఎందుకు బయటికి రావడం లేదనేది మరో వాదన. మొత్తంగా సాయి ధరమ్ ప్రమాదం ఎపిసోడ్ లో సమాధానం లేని ప్రశ్నలు ఎన్నో. ఏది ఏమైనా ఆయన పూర్తిగా కోలుకొని ఇంటికి చేరారు. అది ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రియులను సంతోషానికి గురిచేస్తున్న అంశం. 
 

click me!