
ఎపిసోడ్ ప్రారంభంలో ఆర్య, రవితో ఈ మెసేజ్ ని సోషల్ మీడియాలో ఉన్న సివిల్ ఇంజనీర్ గ్రూప్స్ లోకి పంపు తప్పకుండా ఎవరైనా వస్తారు. ఇప్పుడు పని ఉన్న వాళ్ళు కాకుండా పని లేని వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తే మన పని జరగడానికి అవకాశం ఉంది తప్పకుండా ఇది వర్కౌట్ అవుతుంది అని అంటాడు. తర్వాత మనసులో ఆలోచిస్తూ ఇవన్నీ వింత వింతగా జరుగుతున్నాయి కో ఇన్సిడెంట్ కాదు ఎవరో కావాలనే చేస్తున్నట్టున్నారు అని ఆలోచిస్తూ ఉంటాడు.
ఇంతలో పిల్లలు ఇద్దరు వచ్చి మీకు దెబ్బ తగిలింది అని అన్నారు కదా సార్ అందుకని అప్పు అక్క పరిగెత్తుకుంటూ మీకోసం వెళ్ళింది అని అనగా ఆర్య పరిగెత్తుకుంటూ అనుకోసం వెళ్లి వెతుకుతాడు. అక్కడ అను కనిపించదు మరోవైపు అను కుర్చీలో కట్టేసి ఉంటుంది. దాహం దాహం అని అనగా జలంధర్ అక్కడికి వచ్చి ఒక చుక్క మంచినీళ్లు కూడా ఇవ్వడు ఇప్పుడు నీకోసం అక్కడ ఆర్య వెతుకుతూ ఉంటాడు. కొంతసేపు వెతికేసరికి ఫుట్ ప్రింట్స్ దొరుకుతాయి కానీ అవి సగంలోనే ఆగిపోతాయి.
మళ్లీ తనకి ఎక్కడ ఏ ఆచూకి ఉండదు అలా ఉక్కిరిబిక్కిరి అయిపోతాడు నాకు కావాల్సింది కూడా ఇదే అని అంటాడు. ఏం చేయలేని పరిస్థితుల్లో తిరిగి ఇంటికి వచ్చేస్తాడు ఆర్య. మరోవైపు ఆర్య దీనంగా ఉండడం చూసి యాదగిరి అక్కడికి వచ్చి ఇలాగా ఊరికినే కూర్చోవడం కాదు పనిచేయాలి అని అంటాడు. ఇంతలో అంజలి అక్కడికి వచ్చి ఏమైంది ఆనంద్ ఎందుకు డిస్టర్బ్ గా ఉన్నావు అని అంటుంది. నిన్న మనం మెయిల్ పెట్టాము కదా ఎవరైనా వచ్చారా అని ఆర్య అడుగుతాడు.
ఎవరూ రాలేదు అని ప్రీతి అనగా ఇంతలోనే కొన్ని మంది అక్కడికి వచ్చి, మేము సివిల్ ఇంజనీర్స్ నిన్న మీరు పెట్టిన పోస్ట్ ని చూసి ఇక్కడికి వచ్చాము అని అంటారు. అప్పుడు ఆర్య వాళ్లకు పని చెప్పి ఇది సక్సెస్ అయితే మిమ్మల్ని పర్మినెంట్ చేస్తాను అని అంటాడు. అక్కడ పనులన్నీ మొదలు పెట్టేస్తూ ఉంటారు. దాన్ని చూసి ప్రీతి కుళ్ళుకుంటుంది. మరోవైపు ఒక తేలు వచ్చి అను కాళ్ళ మీద కుడుతుంది. ఇంతలో ఆర్య "అను" అని గట్టిగా అరుస్తూ పిల్లలు చెప్పినట్టు అను ని ఎవరైనా కావాలనే ట్రాప్ చేసి ఉంటారు. అది కూడా అనుకు తెలిసిన వాళ్ళే అయ్యుంటారు అని అనుకుంటాడు.
మరోవైపు ప్రీతి, మాన్సీకి ఫోన్ చేసి ఇక్కడ పనులు చాలా త్వరగా అవుతున్నాయి ఇలాగైతే ప్రాజెక్ట్ పూర్తి అవ్వకూడదు అనే మీ ప్లాన్ వర్క్ అవుట్ అవ్వదు అని అనేలోగా అంజలి అక్కడికి వస్తుంది. అప్పుడు ప్రీతి, అంజలి మేడం ఇక్కడే ఉన్నారు ఫోన్ ఇస్తున్నాను అని మాట మార్చి ఇస్తుంది. అప్పుడు మాన్సీ అంజలి తో ఏం అంజలీ అక్కడ పని లేటుగా అవుతుందా బోర్డ్ మీటింగ్లో ఒకటే తలనొప్పి పెడుతున్నారు. ఆ మేనేజర్ హెడ్ ని తీసేసి ఇంకొకళ్ళు పెట్టొచ్చు. కదా అని అనగా నాకు నా మీద కన్నా ఆనంద్ మీదే నమ్మకం ఎక్కువ. నువ్వేం కంగారు పడొద్దు త్వరలోనే ప్రాజెక్టు పూర్తి చేసి నీకు ఇస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది.
దీనికి దాని మీద కన్నా బ్రో ఇన్ లా మీదే ఎక్కువ నమ్మకం ఉన్నట్టున్నది అని కోపంతో రగిలిపోతూ ఉంటుంది మాన్సీ. మరోవైపు ఆర్య ఆ పిల్లలు ఇద్దరిని తీసుకొని వచ్చి కూలీల ముందు నిల్చోబెట్టి వీళ్లలో ఎవరమ్మా అను దగ్గరికి వచ్చి నన్ను కొట్టారు అని చెప్పింది అని అంటాడు. అప్పుడు ఆ పిల్లలు ఒక వ్యక్తిని చూపిస్తారు. అప్పుడు తను పారిపోతూ ఉండగా ఆర్య వెనక్కి వెళ్లి తనని పట్టుకుంటాడు. అనుని ఎవరు తీసుకువెళ్లారు అని గట్టిగా అడగగా తను జలంధర్ అని అంటాడు. తర్వాత ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం.