
అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు కొమురంభీం పాత్రలో ఎన్టీఆర్ అద్భుతంగా నటించిన సినిమా "ఆర్ ఆర్ ఆర్". రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య మార్చ్ 25 న థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్ గా నిలిచింది. ఆర్ ఆర్ ఆర్ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ ముందు వసూళ్ల సునామి సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 1100 కోట్లకుపై కలెక్షన్లు రాబట్టిన ఈ చిత్రం రీరిలీజ్ కు రెడీ అవుతోంది. ఇద్దరు స్టార్ హీరోల క్రేజ్, రాజమౌళి దర్శకత్వ ప్రతిభ ప్రపంచ వ్యాప్తంగా మాట్లాడుతున్నారు. ఆస్కార్ పోటీలో ఉ న్న ఈ చిత్రం మరోసారి థియేటర్లలో విడుదల చేయనున్నారని సమాచారం.
ఈ సినిమా USAలో ఈ వారం రీ రిలీజ్ చేసారు. అక్కడ చాలా చోట్ల హౌస్ ఫుల్స్ అవుతున్నాయి. ఆస్కార్ ప్రమోషన్ లో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ చిత్రాన్ని రీరిలీజ్ చేస్తున్నారు. మార్చి 10 న ఈ చిత్రం రీరిలీజ్ కాబోతోంది. తెలుగులోనూ భారీ ఎత్తున ఈ సినిమా మరోసారి రిలీజ్ అవటం అభిమానులకు ఆనందం కలిగిస్తోంది. ఆ రోజున చెప్పుకోదగ్గ సినిమాలు ఏమీ రిలీజ్ కు లేకపోవటం ఈ సినిమా రీరిలీజ్ కు కలిసొచ్చే అంశం. అయితే ఈ విషయమై అఫీషియల్ ప్రకటన ఏమీ ఇంకా రాలేదు.
లాస్ ఏంజిల్స్‌లో ఈ నెల 12న 95వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. దాంతో అక్కడ చరణ్ సందడి చేస్తున్నాడు. ఇటీవలే 'గుడ్ మార్నింగ్ అమెరికా' షోతో పాటు ఏబీసీ న్యూస్ వాళ్లు నిర్వహించిన ఇంటర్వ్యూస్‌లో పాల్గొన్న రామ్ చరణ్, ఇప్పుడు లాస్ ఏంజిల్స్ వైబ్స్‌లో మునిగి తేలుతున్నాడు. ఈ నేపథ్యంలో అక్కడి పాప్యులర్ ఎంటర్‌టైన్మెంట్ ఛానల్ KTLA రామ్ చరణ్‌ను ఇంటర్వ్యూ చేసింది.
మా డైరెక్టర్ రాజమౌళిగారు రాసిన అత్యుత్తమ చిత్రాల్లో RRR ఒకటి. ఇందులో చాలా జోనర్స్ మిళితమై ఉన్నాయి. ఇద్దరి హీరోల మధ్య ఉన్న సోదర అనుబంధాన్ని ఎలివేట్ చేసిన తీరు చక్కగా కుదిరింది. ఇది అల్లూరి - భీమ్ అనే ఇద్దరు యువకుల మధ్య ఉండే స్నేహాన్ని తెలియజేస్తూనే, భారతదేశం ఎదుర్కొన్న వలసవాద అణచివేతకు వ్యతిరేకంగా చేసిన పోరాటం గురించి కూడా తెలియజేస్తుంది. సెంటిమెంట్స్‌ను టచ్ చేస్తుంది అన్నారు.