మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘రావణసుర’. తాజాగా ఈ చిత్రం నుంచి టీజర్ విడుదలై ఆకట్టుకుంటోంది. గతంలో చూడని షేడ్స్ లో రవితేజ అలరించబోతున్నారు.
మాస్ మహారాజ రవితేజ (Raviteja) తాజాగా నటిస్తున్న యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ ‘రావణసుర’ (Ravanasura) రిలీజ్ కు సిద్దమవుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని తుదిమెరుగులు దిద్దుకొంటోంది. మరోవైపు చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అందిస్తూనే ఉన్నారు. తాజాగా ‘రావణసుర’ నుంచి పవర్ ఫుల్ టీజర్ ను విడుదలై చేశారు. టీజర్ మొదలైనప్పటి నుంచి చివరి వరకు ఆద్యంత ఆసక్తికరంగా మారింది. మర్డర్ మిస్టరీతో కూడిన థ్రిల్లింగ్ అంశాలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.
రవితేజ కేరీర్ లోనే మొదటిసారిగా క్రైమ్ థ్రిల్లర్ లో నటిస్తుండటం విశేషం. మరోవైపు లాయర్‌గానూ పరిచయం అవుతున్నాడు. టీజర్ లో మాస్ రాజా వరుస షాట్‌లు పాత్రలోని విభిన్న వైవిధ్యాలను చూపుతున్నాయి. రవితేజ డిఫరెంట్ షేడ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఆయనలోని కొత్త కోణాన్ని బయటికి తీశారని చెప్పొచ్చు. టీజర్ లో రవితేజ చెప్పిన డైలాగ్ ‘సీతని తీసుకెళ్లాలంటే సముద్రం దాటితే సరిపోదు. ఈ రావణాసురుణ్ణి దాటి వెళ్లాలి’ చాలా పవర్ ఫుల్ గా ఉంది. దీంతోపాటు యాక్షన్ సీన్స్ కూడా అదిరిపోనుందని టీజర్ తో అర్థం అవుతోంది.
టీజర్ మొదలైనప్పటి నుంచి చివరి వరకు రవితేజను చాలా డిఫరెంట్ షేడ్స్ లో చూపించే ప్రయత్నం ఆసక్తి పెంచుతోంది. ఏకంగా ఐదుగురు హీరోయిన్లతో ఈ క్రైమ్ థ్రిల్లర్ ఎలా సాగబోతుందోనని ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సైతం ఆకట్టుకుంటుంది. ప్రొడక్షన్ వాల్యూస్ గ్రాండ్ గానే కనిపిస్తుండటంతో సినిమాపై మరింత హైప్ ను పెంచుతోంది. అలాగే, టీజర్‌లో ‘సత్యం కల్పితం కంటే భయంకరమైనది’ అనే కోట్ ప్రస్తావించడం.. సినిమాలో క్రైమ్, థ్రిల్లింగ్ అంశాలు, వయలెన్స్ ఎంత ఉంటుందో అర్థం అవుతోంది.
‘రావణసుర’ చిత్రంలో మాస్ మహారాజా రవితేజ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్, RT టీమ్‌వర్క్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో సంగీతం, విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు. ఈ సినిమాలో సుశాంత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. హీరోయిన్లు అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ, అలాగే రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, నితిన్ మెహతా (అఖండ ఫేమ్), సత్య, జయ ప్రకాష్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 7న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. అలాగే రవితేజ నటిస్తున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ ‘టైగర్ నాగేశ్వర రావు’ కూడా తుది దశ షూటింగ్ లో ఉంది.
Welcoming you all to my world!
The world 🔥
Here’s the :))
- https://t.co/VnG6MdhzOV
Looking forward to seeing you all at the theatres this April 7th 🤗🤗🤗 pic.twitter.com/TKcZHrVeZJ