ఎంజీఆర్‌గా అరవింద్‌స్వామి లుక్‌ రిలీజ్‌.. అచ్చు గుద్దేశాడుగా!

Published : Dec 24, 2020, 11:09 AM IST
ఎంజీఆర్‌గా అరవింద్‌స్వామి లుక్‌ రిలీజ్‌.. అచ్చు గుద్దేశాడుగా!

సారాంశం

`తలైవి`లో కీలక పాత్ర అయిన పురుచ్చి తలైవర్‌, మాజీ తమిళనాడు సీఎం, అగ్ర నటుడు ఎంజీఆర్‌ పాత్రలో `రోజా` ఫేమ్‌ అరవింద్‌ స్వామి నటిస్తున్నారు. ఎంజీఆర్‌ 33వ వర్థంతి నేడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఎంజీఆర్‌ పాత్రలో నటిస్తున్న అరవింద్‌స్వామి లుక్‌ని విడుదల చేశారు. 

అలనాటి నటి, మాజీ తమిళనాడు సీఎం జయలలిత జీవితం ఆధారంగా `తలైవి` చిత్రం రూపొందుతుంది. జయలలితగా కంగనా రనౌత్‌ నటిస్తున్నారు. ఇందులో కీలక పాత్ర పురుచ్చి తలైవర్‌, మాజీ తమిళనాడు సీఎం, అగ్ర నటుడు ఎంజీఆర్‌ పాత్రలో `రోజా` ఫేమ్‌ అరవింద్‌ స్వామి నటిస్తున్నారు. ఎంజీఆర్‌ 33వ వర్థంతి నేడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఎంజీఆర్‌ పాత్రలో నటిస్తున్న అరవింద్‌స్వామి లుక్‌ని విడుదల చేశారు. 

రాజకీయ నాయకుడుగా కార్యకర్తలకు దెండం పెడుతున్న ఫోటో, స్కూల్‌లో పిల్లలతో కలిసి భోజనం చేస్తున్న బ్లాక్‌ అండ్‌ వైట్‌లోని ఈ ఫోటోలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. సోషల్‌ మీడియాలో ఆయా ఫోటోలు తెగ వైరల్‌ అవుతున్నాయి. ఈ సందర్భంగా అరవింద్‌ స్వామి `పురుచ్చి తలైవర్‌ ఎంజీఆర్‌ పాత్రని పోషించడం కేవలం గౌరవం మాత్రమే కాదు, గొప్ప బాధ్యత. దర్శకుడు ఎ.ఎల్‌. విజయ్‌, నిర్మాతలకు ధన్యవాదాలు. నా మీద నమ్మకం ఉంచినందుకు, నేను ఈ చిత్రాలను తలైవర్‌ జ్ఞాపకార్థం వినయంగా పోస్ట్ చేస్తున్నా` అని పేర్కొన్నారు. 

ఇందులో కరుణానిధిగా ప్రకాష్‌ రాజ్‌ నటిస్తున్న విషయం తెలిసిందే. ఎ.ఎల్‌ విజయ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ఈ చిత్ర షూటింగ్‌పూర్తయ్యింది. ఈ విషయాన్ని కంగనా సోషల్‌ మీడియా ద్వారా పంచుకుని భావోద్వేగానికి గురయ్యింది. తలైవి పాత్రలో నటించడం గౌరవంగా భావిస్తున్నట్టు పేర్కొంది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి
Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?