
కంగనా రనౌత్ మరోసారి వివాదంలో ఇరుక్కున్నారు. దీంతో మరోసారి వార్తలో హాట్ టాపిక్‌గా మారారు. ఆమె పంచుకున్న బికినీ ఫోటో ఇప్పుడు పెద్ద దుమారమే రేపుతుంది. కంగనా బుధవారం బికినీ ఫోటోని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. ఇది మెక్సీకోలోని తులుం అనే ఐలాండ్ బీచ్‌లో దిగిన ఫోటో. బికినీ ధరించిన కంగనా బీచ్‌లో కూర్చొని సముద్ర అలలను చూస్తుంది. ఈ సందర్భంగా వెనకాల నుంచి తీసిన ఫోటో ఇది.
ఈ ఫోటోని షేర్ చేస్తూ, `నేను ఎంతో ఉత్సాహంగా వెళ్ళిన అద్బుతమైన, అందమైన ప్రదేశాల్లో మెక్సికో ఒకటి. మెక్సీకోలోని తులుం అనే చిన్న ఐలాండ్‌లో దిగిన ఫోటో ఇదే` అని తెలిపింది. ఇదే ఇప్పుడు పెద్ద దుమారం రేపుతుంది. ట్రోలింగ్‌కి కారణమైంది. ఈ ఫోటోని చూసిన నెటిజన్లు విమర్శలతో విరుచుకుపడ్డారు. గతంలో భారతీయ సాంప్రదాయాలు, విలువల గురించి మాట్లాడిన నువ్వు ఇలాంటి దుస్తుల్లో కనిపించడమేంటి అంటూ ఓ రేంజ్‌లో మండిపడ్డారు. వరుసగా కామెంట్లు చేస్తూ ట్రోల్ చేశారు.
దీనికి కంగనా స్పందించింది. తన బికినీ ఫోటోని చూసి కొందరు తనకు సనాతన ధర్మం గురించి హితబోధ చేస్తున్నారని వ్యంగ్యంగా పోస్ట్ పెట్టింది. భైరవి దేవత జుల్లు విరబోసుకుని, దుస్తులు లేకుండా, రక్తం తాగుతూ మీ ముందు నిలబడితే మీరేం చేస్తారని కంగనా ప్రశ్నించింది. మీరు భయపడతారని, ఆ సమయంలో మిమ్మల్ని మీరు భక్తులుగా చెప్పుకోరా? అంటూ కడిగిపారేసింది. మతంపై మీకే అధికారం ఉందన్నట్టు నటించవద్దని చెబుతూ, జై శ్రీరామ్ అని పేర్కొంది.
ఇదిలా ఉంటే కంగనా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం అనంతరం బాగా వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. నెపోటిజం, బాలీవుడ్‌లో డ్రగ్స్ మాఫియా గురించి దుమ్మెత్తిపోశారు. అలాగే ఈ కేసు విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యంపై కూడా ఆమె మండిపడ్డారు. ఈ క్రమంలో ఓ దశలో మహారాష్ట్ర ప్రభుత్వానికి, కంగనాకి మధ్య చిన్న పాటి యుద్ధమే జరిగింది.