జయ-శోభన్ బాబులు ఫైన్ బ్రీడ్.. శశికళ మండోదరి

Published : Sep 08, 2017, 02:25 AM ISTUpdated : Mar 25, 2018, 11:40 PM IST
జయ-శోభన్ బాబులు ఫైన్ బ్రీడ్.. శశికళ మండోదరి

సారాంశం

శోభన్ బాబు, జయలలితల బాంధవ్యంపై ఆసక్తికర నిజాలు పలు కీలక విషయాలు వెల్లడించిన శోభన్ సన్నిహితురాలు,ఆరుద్ర సతీమణి రామలక్ష్మి శోభన్, జయల గురించి చెప్తూనే శశికళను మండోదరితో పోల్చిన రామ లక్ష్మి  

తెలుగు సినీ పరిశ్రమలో అలనాటి అందాల నటుడు శోభన్ బాబు, తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలలితల మధ్య ప్రేమ వ్యవహారం గురించి అంతు చిక్కని రహస్యాలెన్నో. శోభన్, జయల ప్రేమాయణం మాత్రం నిజమని వాళ్లకు దగ్గరిగా మెలిగిన సన్నిహితులు చెప్తుంటారు. ఒక దశలో పెళ్లి కూడా చేసుకుందామనుకున్నారని, అయితే కొన్ని కారణాల వల్ల వాళ్లిద్దరూ వివాహ బంధంతో ఒకటి కాలేకపోయారని అంటుంటారు.

 

తాజాగా దివంగత శోభన్ బాబు, జయలలితల గురించి ప్రముఖ రచయిత ఆరుద్ర భార్య కె రామలక్ష్మి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ప్రముఖ కాలమిస్ట్, రైటర్, క్రిటిక్ అయిన రామలక్ష్మి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో... శోభన్ బాబు, జయ లలితల మధ్య వున్న బాంధవ్యం గురించి తనకు తెలిసిన విషయాలు చెప్పి సంచలనానికి తెరతీశారు.

 

తనను ఓసారి శోభన్ బాబు తన ఇంటికి పిలిచారని, అక్కడ తన భార్యను చూపించాడని, తన గురువు గారు కూతురు పెళ్లి చేయలేడని తెలిసి, తానే ఆమెను పెళ్లి చేసుకున్నానని చెప్పాడని రామలక్ష్మి తెలిపారు. శోభన్ బాబు చాలా గొప్ప వ్యక్తి అన్నారు. జయలలిత కూడా వెరీ వెరీ ఫైన్ టాలెంటెడ్ గాళ్ అని రామలక్ష్మి తెలిపారు. గోరింటాకు సినిమాను జయలలిత ఇంట్లో చిత్రీకరించారు. అప్పుడు మీరందరూ ఇక్కడే భోజనం చేయాలని జయలలిత.. శోభన్ బాబుతో చెప్పిందని తెలిపారు. తనే స్వయంగా వడ్డిస్తానని జయలలిత చెప్పారని తెలిపారు. జయలలిత నిజమైన ప్రేమ కనబరుస్తుందన్నారు.

 

ఇక జయలలితను శోభన్ బాబు పెళ్లి చేసుకుందామనుకున్నా అది సాధ్యపడలేదన్నారు. ఆయన తన భార్యను మోసం చేయలేకపోయాడన్నారు. శోభన్ బాబు చాలా సిన్సియర్ అన్నారు. శోభన్ బాబు కొడుకు కూడా బాగానే ఉంటాడని, కానీ ఎందుకో సినిమాల్లోకి రావద్దని చెప్పాడన్నారు.

 

జయలలిత నెచ్చెలి శశికళను మండోదరితో పోల్చారు రామలక్ష్మి. పోయెస్ గార్డెన్ గేట్లో నుంచి శశిని ఈడ్చేశారని, పబ్లిక్‌ను కంట్రోల్ చేయకుంటే చంపేసేవారన్నారు. శశికళ అంత డబ్బు చేసుకున్నాక కూడా ఆమెను (జయలలితను) చంపడం దారుణం అన్నారు. జయలలితకు మోకాళ్ల నొప్పులు ఎక్కువగా ఉంటాయని, అలాంటి ఆమెను శశికళ మంచం మీద నుంచి కిందకు లాగి పడేసిందని తెలిసిందని, అప్పుడు ఆమె కిందపడిపోయిందని, పని మనిషి సాయం పట్టటానికి వెళ్తే... చంపేస్తానని శశికళ ఆమెను బెదిరించిందని తెలిసిందని రామలక్ష్మి చెప్పారు. ఆ తర్వాతే జయను ఆసుపత్రికి తరలించారన్నారు. జయలలితను దాదాపు చంపేశారని, శశికళ ముఖం చూసినా అసహ్యం అన్నారు.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా
Demon Pavan: తాను విన్నర్ కాదని తెలుసు, రవితేజతో బేరమాడి భారీ మొత్తం కొట్టేసిన డిమాన్ పవన్.. లక్ అంటే ఇదే