మహేష్ తో చాన్స్ వస్తే కాదంటానా..

Published : Sep 07, 2017, 06:46 PM ISTUpdated : Mar 25, 2018, 11:59 PM IST
మహేష్ తో చాన్స్ వస్తే కాదంటానా..

సారాంశం

టాలీవుడ్ లో టాప్ రేంజ్ వరకు వెళ్లిన ఇలియానా కోటి రూపాయల పారితోషికం తీసుకున్న తొలి హిరోయిన్ బాలీవుడ్ బాటపట్టిన ఇలియానాకు మహేష్ తో చాన్స్ ఇస్తే తప్పక చేస్తుందట

గోవా బ్యూటీ ఇలియానా సౌత్ సినిమాల వైపు చూసి చాలా కాలం అయ్యింది. ఇక్కడ మంచి ఫాంలో ఉన్నప్పుడు బాలీవుద్ అవకాశాలు రాగానే అక్కడికి చెక్కేసింది అమ్మడు. ప్రస్తుతం అక్కడ హిట్ కోసం తపిస్తున్న అమ్మడు ఇక్కడ ఛాన్స్ వస్తే నటించాలని ఉందని హింట్ ఇస్తుంది. ఇక ఈమధ్య ఇలియానా మహేష్ తో నటించబోతుందని లేటెస్ట్ టాక్.

 

అయితే ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని ఆ సినిమా నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు వెళ్లడించారు. ఒక్కసారిగా మహేష్ సినిమాతో వార్తల్లో నిలిచిన ఇల్లి బేబ్ తన అభిమానులతో సరదా చాటింగ్ చేసింది. ఇక మహేష్ అభిమాని నిజంగా మహేష్ తో సినిమా చేస్తున్నారా అని అడుగగా తనకు ఎలాంటి ఆఫర్ రాలేదని వస్తే తప్పకుండా చేస్తానని అన్నది.

 

ఇక రవితేజ అభిమాని ఒకరు కూడా రవితేజతో మీ రిలేషన్ ఏంటని అడిగితె రవితేజ సినిమా అంటే చాలా సరదాగా ఉంటుందని అన్నది. ఆయనతో పనిచేస్తున్నంత సేపు చాలా కంఫర్టబుల్ గా ఉంటుందని సెట్ అంతా ఫన్ని అట్మాస్పియర్ కనిపిస్తుందని అంటుంది. తెలుగులో అవకాశాలు రావాలే గాని ఎగిరిగంతులేసే ఇలియానా ఆ అవకాశాల కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంది. 

 

మరి ఇలియానాను ఏ తెలుగు హీరో కరుణించి అవకాశం ఇస్తాడో చూడాలి. మహేష్ పక్కన ఇలియానా సూపర్ హిట్ పయిర్. పోకిరితో ఇండస్ట్రీ రికార్డులు బద్ధలు కొట్టిన ఈ జంట మరోసారి స్క్రీన్ పై చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అయితే ఇలియానాకు ప్రస్తుతం తెలుగులో మార్కెట్ లేదని అందుకే ఆమెను హీరోలు కావాలనుకున్నా నిర్మాతలు పడనీయట్లేదని అంటున్నారు.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా
Demon Pavan: తాను విన్నర్ కాదని తెలుసు, రవితేజతో బేరమాడి భారీ మొత్తం కొట్టేసిన డిమాన్ పవన్.. లక్ అంటే ఇదే