ఆకట్టుకుంటున్న అర్థమైందా అరుణ్ కుమార్ ట్రైలర్, ఆహా నుంచి మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్

Published : Jun 22, 2023, 02:52 PM IST
ఆకట్టుకుంటున్న అర్థమైందా అరుణ్ కుమార్ ట్రైలర్,  ఆహా నుంచి మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్

సారాంశం

ఆహా నుంచి మరో కొత్త వెబ్ సిరీస్ సందడి చేయబోతోంది. అర్ధంమైందా అరుణ్ కుమార్ టైటిల్ తో తెరకెక్కిన ఈ వెబ్ మూవీ ట్రైలర్ ను తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్. 

జీవితంలో ఏదో సాధించాల‌నే ల‌క్ష్యంతో ఓ చిన్న ప‌ట్ట‌ణ ప్రాంతం నుంచి మ‌హా న‌గ‌రంలోకి ఇంట‌ర్న్‌షిప్ ఉద్యోగిగా అడుగు పెట్టిన అరుణ్ కుమార్ అనే యువ‌కుడి క‌థ‌. జ‌ర్నీలో త‌ను ఎదుర్కొన్న ఒడిదొడుకులు, వాటి నుంచి త‌ను నేర్చుకున్న పాఠాలు, కొర్పొరేట్ ప్ర‌పంచంలో ఎలా ముందుకు సాగాడ‌నే అంశాల‌తో రూపొందిన వెబ్ మూవీ అర్థమైందా అరుణ్ కుమార్. జూన్ 30 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానున్న ఈ వెబ్ సిరీస్ ట్రైల‌ర్‌ను తాజాగా రిలీజ్ చేశారు.  ప్రేక్ష‌కుల‌కు న‌చ్చేలా, ఆలోచింప‌చేసేలా ఈ సిరీస్ రూపొందింది. ఓ యువ‌కుడు కార్పొరేట్ ప్ర‌పంచంలో ఇంట‌ర్న్‌గా ప్ర‌యాణం చేసే క్ర‌మంలో త‌నకు ఎద‌ర‌య్యే అనేక అనుభ‌వాల‌ను ఇందులో చూపించే ప్ర‌య‌త్నం చేశారు. అందులో ప్రేమ‌, క‌ష్ట‌న‌ష్టాలతో పాటు ఏదో సాధించాల‌నుకునే ఆ యువ‌కుడు స‌వాళ్ల‌ను ఎదుర్కొని త‌న‌దైన స్థానాన్ని ఎలా సంపాదించుకున్నాడ‌నే విష‌యాల‌ను ఇందులో చ‌క్క‌గా చూపించారు. 

ఈ ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ అర్థమైందా అరుణ్ కుమార్ సిరీస్ జూన్ 30 నుంచి ప్రేక్షకులను మెప్పించనుంది. అర్రె స్టూడియో, లాఫింగ్ కౌ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్స్‌పై ‘అర్థమైందా అరుణ్ కుమార్’ సిరీస్ రూపొందింది. హ‌ర్షిత్ రెడ్డి, అన‌న్య శ‌ర్మ‌, తేజ‌స్వి మ‌డివాడ త‌దిత‌రులు త‌మ‌దైన న‌ట‌న‌తో పాత్ర‌ల‌కు ప్రాణం పోశారు. ‘అఫిషియల్ చౌక్యాగిరి’ స్ఫూర్తితో దీన్ని రూపొందించారు. దీని కార‌ణంగా ఈ కార్పొరేట్ డ్రామాలో ఓ కొత్త అనుభూతి క‌లుగుతుంది.

ఇక ఈ వెబ్ సిరస్ ట్రైలర్ లాంచ్ ముఖ్య అతిథి, యాక్టర్ ప్రియదర్శి, మాట్లాడుతూ  ఆహాలో ఈ నెల 30 నుంచి స్ట్రీమింగ్ కానున్న అర్థమైందా అరుణ్ కుమార్ వెబ్ సిరీస్ ట్రైల‌ర్ విడుద‌ల కార్య‌క్ర‌మంలో పాల్గొన‌టం చాలా ఆనందంగా ఉంది. ఇదొక వైవిధ్య‌మైన క‌థాంశం. బ‌య‌ట‌కు ఎంతో అందంగా క‌నిపించే కార్పొరేట్ ప్ర‌పంచం ఎలా ఉంటుంది. ఎదో సాధించాల‌నే ల‌క్ష్యంతో ఎంతో మంది యువ‌కులు ఈ కార్పొరేట్ ప్ర‌పంచంలోకి అడుగు పెడ‌తారు. అయితే వారికి ఎదుర‌య్యే స‌వాళ్లు.. వాటిని ఎలా అధిగ‌మించాల‌నే విష‌యాల‌ను ఆవిష్క‌రించారు. ట్రైల‌ర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. త‌ప్ప‌కుండా వెబ్ సిరీస్‌పై మ‌రింత ఆస‌క్తిని పెంచుతుంది అన్నారు.

PREV
click me!

Recommended Stories

ప్రభాస్ అభిమానుల మధ్య నలిగిపోయిన నిధి అగర్వాల్, రాజాసాబ్ ఈవెంట్ లో స్టార్ హీరోయిన్ కు చేదు అనుభవం..
Gunde Ninda Gudi Gantalu Today: ‘ఇతను ఎవరో నాకు తెలీదు’ మౌనిక మాటకు పగిలిన బాలు గుండె, మరో షాకిచ్చిన శ్రుతి