వైరల్ అవుతున్న రామ్ చరణ్-ఉపాసన కూతురు ఫోటో, నిజంగా ఫోటోలో ఉన్నది మెగా వారసురాలేనా..?

Published : Jun 22, 2023, 02:23 PM ISTUpdated : Jun 22, 2023, 02:26 PM IST
వైరల్ అవుతున్న రామ్ చరణ్-ఉపాసన కూతురు ఫోటో, నిజంగా ఫోటోలో ఉన్నది మెగా వారసురాలేనా..?

సారాంశం

రీసెంట్ గా పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది మెగా కోడలు ఉపాసన. జూన్ 20న  తెల్లవారుజామున ఆడబిడ్డకు జన్మనిచ్చింది ఉపాసన. దాంతో మెగా ప్యామిలీలో పండగవాతావరణం నెలకొంది. ఇక తాజాగా సోషల్ మీడియాలో మెగా ప్రిన్సెస్ ఫోటో వైరల్ అవుతోంది. మరి ఈ ఫోటోలో నిజం ఎంత..? 


జులైలో డెలివరీ అని అనుకుంటుండగా.. సడెన్ గా జూన్ లోనే డెలివరీ అయ్యింది రామ్ చరణ్ సతీమణి  ఉపాసన. దాదాపు పెళ్లైన పదేళ్ల తరువాత తల్లీ తండ్రులు అయ్యారు మెగా దంపతులు. రామ్ చరణ్ తండ్రి అవ్వడంతో.. దీంతో మెగా ఫ్యామిలీలో సంబరాలు అంబరాన్ని అంటాయి.  రాంచరణ్ ఉపాసన దంపతులకు పాప జన్మించిందనే విషయం తెలియడంతో అభిమానులు అలాగే అల్లు అర్జున్, వరుణ్ తేజ్, ఎన్టీఆర్ వంటి సినీ సెలబ్రెటీలు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 

 

ఇక పాపను చూడటం కోసం మెగా, అల్లు  ఫ్యామిలీ నుంచి సెలబ్రిటీలు అపోలో హాస్పిటల్ కు క్యూ కట్టారు. ఇక ఇదిలా ఉండగా..   రామ్ చరణ్ గారాల కూతురు అంటూ.. బేబీ ఫోటో ఒకటి సోషల్ మీడియాలోవైరల్ అవుతూ వస్తోంది.  చరణ్ కూతురి ఫోటోలు లీక్ అయినట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది.  చరణ్ గారాల కూతురు.. ఈ ఫోటోలు చూసి ఎవరి పోలికో చెప్పాలని..నెటిజన్లను కూడా అడిగేస్తున్నారు. అయితే నిజంగా ఈఫోటోలో ఉన్నది మెగా వారసురాలేనా..? కాదా అనేది మాత్రంతెలియడం లేదు. 

 

అటు మెగా ఫ్యామిలీ లోకూడా ఈ విషయం గురించి  ఎవరూస్పందించలేదు. అయితే.. ఈ విషయంలో మెగా టీమ్ స్పందించినట్టు కూడా ఓ వార్త హల్ చల్ చేస్తుంది. ఈ పోటోలో ఉన్నది రామ్ చరణ్, ఉపాసన కూతురు కాదు అంటూ వార్తు చెప్పిన్టు తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ ఫోటో మాత్రం నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. చాలామంది పాప రామ్ చరణ్ పోలికా అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొంది మంది ఇది ఫేక్ ఫోటో అంటూ కామెంట్ చేస్తున్నారు. 

 

ఇక హాస్పిటల్ లో మెగా ,అల్లు ఫ్యామిలీ లో అందరూ హాస్పిటల్ కు వచ్చి చూశారు. కాని  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం వారాహి యాత్రలో ఉండటం వల్ల రాలేకపోయారు ఫోన్ లో విష్ చేసినట్టు సమాచారం. ఇక మనవరాలు పుట్టడంతో మెగాస్టార్ చిరంజీవి ఎంతో సంతోషించారు. చిరంజీవి మీడియాతో తన ఆనందాన్ని కూడా పంచుకున్నారు. మంచి ఘడియల్లో పాప జన్మించిందని.. మా కుటుంబంలో ఆనంద వాతావరణం ఎదురైందని చిరు అన్నారు.

PREV
click me!

Recommended Stories

ప్రభాస్ అభిమానుల మధ్య నలిగిపోయిన నిధి అగర్వాల్, రాజాసాబ్ ఈవెంట్ లో స్టార్ హీరోయిన్ కు చేదు అనుభవం..
Gunde Ninda Gudi Gantalu Today: ‘ఇతను ఎవరో నాకు తెలీదు’ మౌనిక మాటకు పగిలిన బాలు గుండె, మరో షాకిచ్చిన శ్రుతి