Vijay Thalapathy Birthday: ఫ్యాన్స్ కు విజయ్ బర్త్ డే గిఫ్ట్.. లియో మూవీ నుంచి అదిరిపోయే ఫస్ట్ లుక్ రిలీజ్..

Published : Jun 22, 2023, 11:37 AM ISTUpdated : Jun 22, 2023, 11:47 AM IST
Vijay Thalapathy Birthday: ఫ్యాన్స్ కు విజయ్ బర్త్ డే గిఫ్ట్.. లియో మూవీ నుంచి అదిరిపోయే ఫస్ట్ లుక్ రిలీజ్..

సారాంశం

తన ఫ్యాన్స్ కు బర్త్ డే గిఫ్ట్ ఇచ్చాడు ఇళయదళపతి విజయ్. అభిమానుల ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న లియో మూవీ నుంచి పవర్ ఫుల్ అప్ డేట్ ను అందించారు మేకర్స్.   

వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు దళపతి విజయ్. ఆయన తన  67వ సినిమాను పరుగులు పెట్టిస్తున్నాడు. లియో టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ  సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. అంతే కాదు విజయ్ కి మాస్టర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందించిన తమిళ యువ దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఈసినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. లలిత్ కుమార్ - జగదీశ్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇక అన్నిసినిమాలు ఒక ఎత్తు.. ఈసినిమా మరో ఎత్తు అన్నట్టుగా మూవీని రూపొందిస్తున్నారు మేకర్స్. విజయ్ కూడా ఈసినిమాలో డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో కనిపించబోతున్నాడని టాక్. 

ఈ రోజు( జూన్ 22) విజయ్ బెర్త్ డే .. సందర్భంగా  లియో  సినిమా నుంచి విజయ్ పవర్ ఫుల్ లుక్ ను రిలీజ్ చేశారు  మేకర్స్.   మంచుకొండల నేపథ్యంలో బలమైన సుత్తినే ఆయుధంగా ఉపయోగిస్తూ ఆయన శత్రు సంహారం చేస్తున్నట్టుగా ఈ పోస్టర్ ఉంది.  దీంతో ఈ ఫస్ట్ లుక్ వైరల్ గా మారింది. ఇక విజయ్ పుట్టిన రోజూ నాడు రిలీజ్ చేయడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫస్ట్ లుక్ లో విజయ్ సుత్తి పట్టుకొని విలన్స్ తో ఫైట్ చేస్తున్నట్టు ఉంది. విజయ్ ని చాలా పవర్ ఫుల్ గా చూపించారు. ఇక విజయ్ పక్కన తోడేలు కూడా కోపంగా చూస్తూ ఉంది. ఇంత మాస్ గా ఫస్ట్ లుక్ ఉండటంతో లియో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి.

 

విజయ్  సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్  అనిరుధ్ కాంబినేషన్ లో విజయ్ సినిమా అంటే అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి.  ఈ ఇద్దరూ కలిసి చేయబోయే మ్యూజికల్ ఫీస్ట్ కోసం అభిమానులంతా వెయిట్ చేస్తున్నారు. అంతే కాదు ఈసినిమాలో స్టార్ నటీనటులు సందడి చేయబోతున్నాయి. ఈ సినిమాతో హీరోయిన్ గా  త్రిష సెకండ్ ఇన్నింగ్స్ సార్ట్ చేసింది. విజయ్ జోడీగా మారోసారి సందడిచేయబోతోంది. ఇక బాలీవుడ్ స్టార్ నటుడు  సంజయ్ దత్, అర్జున్ ,  ప్రియా ఆనంద్, గౌతమ్ మీనన్,. మన్సూర్ అలీఖాన్ కనిపిస్తున్నారు. అక్టోబర్ 19వ తేదీన ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

సుజీత్ కి పవన్ కారు గిఫ్ట్ గా ఎందుకు ఇచ్చారో తెలుసా ? అంత పెద్ద త్యాగం చేశాడా, హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే
The Raja Saab: ప్రభాస్ రాజాసాబ్ సాంగ్ పై విపరీతంగా ట్రోలింగ్.. వర్షం, డార్లింగ్ సినిమాలు వైరల్