
మల్టీస్టారర్ అంటే ప్రేక్షకులకు ఏ స్థాయిలో ఇష్టం ఉంటుందో అందరికి తెలిసిందే. అలాంటి సినిమాలకు మంచి మార్కెట్ ఉంటుందని దర్శక నిర్మాతలకు తెలియనిది కాదు. ఇద్దరు స్టార్ హీరోలను ఒకే ప్రేమ్ లో చూపించాలని వారికి కూడా ఉంటుంది. కానీ కథలో చిన్నా తేడా వచ్చిన కథానాయకులు ఒప్పుకోరని తెరవెనుకకు వెళ్లి చుస్తే అర్ధమవుతుంది. అందుకే కొన్ని సార్లు దర్శకులు కూడా భయపడతారు.
ఇకపోతే రీసెంట్ గా వచ్చిన దేవ దాస్ సినిమాలో 'కొన్ని హెచ్చు తగ్గుల్లో దర్శకుడు మార్పులు చేశారని టాక్ వస్తోంది. ప్రస్తుతం ఉన్న మార్కెట్ ప్రకారం నాగార్జున కంటే నాని కొంత ఎక్కువగానే క్రేజ్ ఉందని చెప్పవచ్చు. అలాగని సీనియర్ హీరో నాగ్ ముందు నాని ఎక్కువ అని చెప్పలేము. ఆయనకు కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే దేవదాస్ సినిమాలో కొన్ని సన్నివేశాల్లో నాని నటన హైలెట్ గా నిలిచింది.
నాగార్జున డాన్ పాత్ర కన్న నాని అమాయకత్వంతో చేసిన డాక్టర్ పాత్ర ఆకట్టుకుంది. ఇక రీసెంట్ గా సినిమాకు సంబందించిన ఒక డిలీట్ సీన్ ను చిత్ర యూనిట్ యూ ట్యూబ్ లో రిలీజ్ చేసింది. ఆ సీన్ ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుంటుంది. రావు రమేష్ ముందు నాని నట విశ్వరూపం చూపించాడు. కానీ అంత మంది సన్నివేశాన్ని ఎందుకు కట్ చేశారనే విషయంపై రూమర్స్ వస్తున్నాయి.
నాగ్ పాత్రను నాని క్యారెక్టర్ అప్పటికే డామినేట్ చేసినట్టు అనిపించిందని చిత్ర యూనిట్ లో గుసగుసలు మొదల్యయ్యాట. ఇక ఈ సీన్ డోస్ మరి ఎక్కువగా ఉందని అందుకే చిన్న సీన్ వల్ల మల్టీస్టారర్ లో ఏ హీరో ఎక్కువ తక్కువ కాకూడదని సీన్ కట్ చేశారని తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని ప్రస్తుతం సినిమా కలెక్షన్స్ అంతంతమాత్రంగానే ఉన్నాయి.