స్పీడ్ పెంచిన త్రివిక్రమ్.. అరవింద సమేత సెన్సార్ వర్క్?

Published : Sep 26, 2018, 06:30 PM IST
స్పీడ్ పెంచిన త్రివిక్రమ్.. అరవింద సమేత సెన్సార్ వర్క్?

సారాంశం

అక్టోబర్ 11న సినిమా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. అయితే విడుదలకు సమయం దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ సెన్సార్ పనులను కూడా వీలైనంత త్వరగా ఫినిష్ చెయ్యాలని అనుకుంటోంది. ఇప్పటికే డబ్బింగ్ వర్క్ కూడా ఎండింగ్ కు వచ్చేసింది. 

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తోన్న చిత్రం అరవింద సమేత. సినిమాకు సంబందించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు రీసెంట్ గా మొదలయ్యాయి. అక్టోబర్ 11న సినిమా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. అయితే విడుదలకు సమయం దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ సెన్సార్ పనులను కూడా వీలైనంత త్వరగా ఫినిష్ చెయ్యాలని అనుకుంటోంది. 

ఇప్పటికే డబ్బింగ్ వర్క్ కూడా ఎండింగ్ కు వచ్చేసింది. దీంతో అక్టోబర్ 6న.. అంటే రిలీజ్ డేట్ కు నాలుగు రోజుల ముందే సెన్సార్ వర్క్ కూడా ఫినిష్ చెయ్యాలని త్రివిక్రమ్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఆ తరువాత సినిమాకు సంబందించిన ప్రమోషన్స్ లో ఎలాంటి టెన్షన్ లేకుండా పాల్గొనవచ్చని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 

త్రివిక్రమ్ శైలిలో ఫ్యాక్షన్ ప్లస్ యాక్షన్ అంశాలతో కూడుకున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ తల్లిగా బాలీవుడ్ నటి సుప్రియ పథక్ కనిపించనున్నారు. ఇక హీరోయిన్ గా పూజ హెగ్డే నటిస్తున్న సంగతి తెలిసిందే. 

 

      

PREV
click me!

Recommended Stories

Akhanda 2 Review: 'అఖండ 2' మూవీ రివ్యూ, రేటింగ్.. బాలకృష్ణ తాండవం ఎలా ఉందో తెలుసా ?
సపోర్ట్ చేసినందుకు వెన్నుపోటు పొడిచిన కళ్యాణ్, మనస్తాపానికి గురైన భరణి.. తనూజ ఏడుపు ఫేక్ అంటూ ముఖం మీదే