పెళ్లైనా.. ఈ బట్టలేంటి..? సమంతపై నెటిజన్లు ఫైర్!

Published : Sep 26, 2018, 05:00 PM IST
పెళ్లైనా.. ఈ బట్టలేంటి..? సమంతపై నెటిజన్లు ఫైర్!

సారాంశం

అక్కినేని ఇంటి కోడలు అయిన తరువాత సమంతపై ఉన్న అభిమానం గౌరవంగా మారిపోయింది. ఆమెని ఓ హీరోయిన్ గా కాకుండా తెలుగింటి కోడలుగా చూస్తున్నారు చాలా మంది అభిమానులు. అలానే ఈ మధ్యకాలంలో సమంత కూడా చాలా పద్దతిగా కనిపిస్తూ.. అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 

అక్కినేని ఇంటి కోడలు అయిన తరువాత సమంతపై ఉన్న అభిమానం గౌరవంగా మారిపోయింది. ఆమెని ఓ హీరోయిన్ గా కాకుండా తెలుగింటి కోడలుగా చూస్తున్నారు చాలా మంది అభిమానులు. అలానే ఈ మధ్యకాలంలో సమంత కూడా చాలా పద్దతిగా కనిపిస్తూ.. అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే తాజాగా ఆమె తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక ఫోటోని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

ప్రస్తుతం విదేశాల్లో చైతుతో హాలిడే సీజన్ ని ఎంజాయ్ చేస్తోన్న సమంత అక్కడి ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. రెడ్ కలర్ సెమీ బికినీలో ఆమె ఇచ్చిన స్టిల్ పై నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

పెళ్లైన తరువాత ఇలాంటి బట్టలు అవసరమా..? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అక్కినేని కోడలుగా మీపై ఉన్న గౌరవాన్ని ఇలా తగ్గించుకోకండి.. అంటూ కొందరు విమర్శిస్తుంటే మరికొందరు మాత్రం సమంతకి మద్దతుగా నిలుస్తున్నారు. పెళ్లి కాకముందు సమంతను ఇలాంటి బట్టల్లో చూసిన వారికి ఇప్పుడేంటి సమస్య అంటూ ప్రశ్నిస్తున్నారు. మరి ఈ ట్రోలింగ్ పై సమంత ఎలా స్పందిస్తుందో చూడాలి!
 

PREV
click me!

Recommended Stories

Akhanda 2 Review: 'అఖండ 2' మూవీ రివ్యూ, రేటింగ్.. బాలకృష్ణ తాండవం ఎలా ఉందో తెలుసా ?
సపోర్ట్ చేసినందుకు వెన్నుపోటు పొడిచిన కళ్యాణ్, మనస్తాపానికి గురైన భరణి.. తనూజ ఏడుపు ఫేక్ అంటూ ముఖం మీదే