విజయ్ దేవరకొండ బైక్ స్టోరీ..!

By Udayavani DhuliFirst Published 24, Jan 2019, 3:21 PM IST
Highlights

టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ వరుస విజయాలు అందుకుంటూ కెరీర్ పరంగా దూసుకుపోతున్నాడు. ఇటీవల 'టాక్సీవాలా' సినిమాతో సక్సెస్ అందుకున్న విజయ్ ప్రస్తుతం 'డియర్ కామ్రేడ్' సినిమాలో నటిస్తున్నాడు. 

టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ వరుస విజయాలు అందుకుంటూ కెరీర్ పరంగా దూసుకుపోతున్నాడు. ఇటీవల 'టాక్సీవాలా' సినిమాతో సక్సెస్ అందుకున్న విజయ్ ప్రస్తుతం 'డియర్ కామ్రేడ్' సినిమాలో నటిస్తున్నాడు.

ఈ సినిమా దాదాపుగా పూర్తయింది. ఈ సినిమా తరువాత క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. పూర్తి స్థాయి లవ్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉండబోతుంది. మొదటి నుండి తనకు సూటయ్యే, జనాలకు నచ్చే కథలను ఎన్నుకుంటోన్న విజయ్ దేవరకొండ కథలపై మరింత దృష్టి పెట్టాడు.

క్రాంతి మాధవ్ సినిమా పూర్తయిన తరువాత ఏ సినిమా చేయాలనే విషయంపై ఇప్పటికే క్లారిటీకి వచ్చేశాడు ఈ హీరో. రీసెంట్ గా ఓ తమిళ దర్శకుడు విజయ్ దేవరకొండకి కథ వినిపించినట్లు తెలుస్తోంది. బైక్ చుట్టూ తిరిగే ఈ కథ విజయ్ ని బాగా ఇంప్రెస్ చేసిందట.

యూత్ కి నచ్చే అంశాలు ఈ సినిమాలో ఉండడం, తన యాటిట్యూడ్ కి దగ్గరగా అనిపించడంతో ఆ కథను ఓకే చేసినట్లు తెలుస్తోంది. క్రాంతి మాధవ్ సినిమా పూర్తయిన తరువాత బైక్ స్టోరీతో సినిమా చేయాలనుకుంటున్నాడు ఈ సెన్సేషనల్ స్టార్. మరి విజయ్ బైక్ కథేంటో తెలుసుకోవాలంటే కొంతకాలం పాటు ఎదురుచూడాల్సిందే!

Last Updated 24, Jan 2019, 3:21 PM IST