'అరవింద సమేత' ప్రీరిలీజ్ హడావిడి.. భారీ ఎత్తున తరలివచ్చిన అభిమానులు!

By Udayavani DhuliFirst Published Oct 2, 2018, 6:03 PM IST
Highlights

యంగ్ టైగర్ ఎన్‌టి‌ఆర్ హీరోగా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ 'అరవింద సమేత' సినిమా రూపొందించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా టీజర్, పాటలను విడుదల చేసింది చిత్రబృందం. ఈరోజు సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ని నిర్వహించనుంది.

మరికొద్ది సేపట్లో ఈ ఫంక్షన్ మొదలుకానుంది. ఇప్పటికే పెద్ద ఎత్తున అభిమానులంతా హైదరాబాద్ లోని ఈవెంట్ జరుగుతోన్న నొవెటెల్ హోటల్ కి చేరుకున్నారు. హాల్ మొత్తం అభిమానులతో నిండిపోయింది. వివిధ ప్రాంతాల నుండి ఎన్‌టి‌ఆర్ ని చూడడానికి భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు.

అయితే వారిమధ్య ఎలాంటి తొక్కిసలాట జరగకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరికాసేపట్లో చిత్రబృందంతో పాటు ఎన్‌టి‌ఆర్ కూడా ఈ వేడుకకు హాజరుకానున్నారు. ఇప్పటివరకు అతిథులుగా ఎవరు రాబోతున్నారనే విషయంపై స్పష్టత రాలేదు. ఎన్‌టి‌ఆర్, త్రివిక్రమ్ లతోనే కార్యక్రమాన్ని నడిపించనున్నారు. కల్యాణ్ రామ్ మాత్రం హాజరుకానున్నట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు.. 

'అరవింద సమేత' ప్రీరిలీజ్ ఎలా ఉండబోతుందంటే!

'అరవింద సమేత' ప్రీరిలీజ్ ఈవెంట్.. బాలయ్య కనిపించడా..?

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్!

అరవింద సమేత.. అసలు కాన్సెప్ట్ ఇదేనట?

click me!