సిరివెన్నెల కుటుంబానికి వైజాగ్ లో స్థలం కేటాయించిన ఏపీ ప్రభుత్వం..

By Mahesh JujjuriFirst Published Mar 26, 2023, 11:33 AM IST
Highlights

సిరివెన్నెల సీతారామశాస్త్రి కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటి స్థలాన్నికేటాయించింది. ఆయన మరణించిన సమయంలో  ప్రకటించిన విధంగా సిరివెన్నెల కుటంబానికి స్థలాన్ని కేటాయించింది ప్రభుత్వం. 
 

ప్రముఖ రచయిత దివంగత  సిరివెన్నెల సీతారామశాస్త్రి  కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  ఇంటి స్థలాన్ని కేటాయించింది. ఏపీ ప్రభుత్వం 500 గజాల ఇంటి స్థలాన్ని వారికి కేటాయించింది. విశాఖపట్టణంలోని బీచ్ కు ఆనుకుని ఉన్నవుడా లే అవుట్ లో ఈ స్థలాన్ని కేటాయించారు. ఇందుకు సంబంధించిన జీవోను కూడా ప్రభుత్వం రిలీజ్ చేసింది. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ ఉన్నత అధికారుల కోసం ప్రత్యేకంగా ఈ లే అవుట్ ఏర్పాటు చేశారు. ఇందులో వారికి స్థలాన్ని ఇవ్వడం చర్చనీయాంశం అయ్యింది.  

అనారోగ్యంతో బాధపడుతూ.. 30 నవంబర్ 2021 లో సీతారామశాస్త్రి కన్నుమూశారు. కొంత కాలం ఆయన హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకున్నారు. అయితే అప్పుడు ఆయన వైద్యానికి అయిన ఖర్చులను సైతం ఏపీ ప్రభుత్వం చెల్లించింది. తాజాగా విశాఖపట్టణంలోని వుడా లే అవుట్ లో సిరివెన్నెల కుటుంబానికి స్థలాన్ని కేటాయిస్తూ.. జీవో జారీ చేసింది. సిరివెన్నెల అనకాపల్లిలో జన్మించారు. ఇండస్ట్రీ హైదరాబాద్ లో ఉండటంతో..ఆయన ఇక్కడ సెటిల్ అయ్యారు. కాని సిరివెన్నెల సోదరులు,కుటుంబం అంతా విశాఖలోనే స్థిరపడ్డారు. విశాఖ, అనకాపల్లితో సీతారామశాస్త్రికి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. దాంతో ఆయన జ్ఞాపకార్ధం విశాఖలో ఇంటి స్థలం కేటాయించారు. 

అంతే కాదు విశాఖపట్నాన్ని ప్రభుత్వం పరిపాలనా రాజధానిగా చేయాలనిచూస్తోంది. అంతే కాదు వైజాగ్ లోనే ఫిల్మ్ ఇండస్ట్రీని కూడా తీసుకురావాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. టాలీవుడ్ కు కావల్సిన రాయితీలను కూడా ఇస్తామంటున్నారు.ఈక్రమంలో సిరివెన్నెల లాంటి ప్రముఖులకు గుర్తుగా ఇక్కడే స్థలం కేటాయించడం చర్చనీయాంశం అయ్యింది.  

ఇక తెలుగు సీనీ పరిశ్రమలో కొన్ని వేల పాటలను రాశారు సీతారామశాస్త్రీ. సిరివెన్నెల సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన.. ఈసినిమాతో బాగా పాపులర్ అయ్యారు. దాంతో సిరివెన్నెల తన ఇంటిపేరుగా.. కలం పేరుగా మారిపోయింది. అద్భుతమైన గీతాలను రచించి.. జాతీయ అవార్డులతోపాటు.. నందీ పురస్కారాలను కూడా అందుకున్నారు సిరివెన్నెల. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ చరిత్రను సృష్టించుకున్నారు సీతారామశాస్త్రీ. ఆనయ తనయుడు రాజా టాలీవుడ్ లో నటుడిగా కొనసాగుతున్నారు. 


 

click me!