వీడియో: నేనెప్పుడూ ధర్మం వైపే నా సపోర్ట్ విష్ణుకే... మనోజ్ కి షాక్ ఇచ్చిన మోహన్ బాబు!

By Sambi ReddyFirst Published Mar 26, 2023, 10:54 AM IST
Highlights

మంచు బ్రదర్స్ మధ్య నెలకొన్న విభేదాలు తారాస్థాయికి చేరాయి. మనోజ్ పోస్ట్ చేసిన వీడియో స్పష్టత వచ్చింది. మనోజ్-విష్ణు మధ్య దూరం పెరిగిందని తెలుస్తుండగా... మోహన్ బాబు మద్దతు ఎవరికనే చర్చ మొదలైంది. 
 

మనోజ్-విష్ణు మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. మొన్నటి వరకు నాలుగు గోడల మధ్య ఉన్న గొడవలు రచ్చకెక్కాయి. సహనం కోల్పోయిన మనోజ్ సంచలన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తన వాళ్ళ మీద విష్ణు దాడి చేస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. ఫేస్ బుక్ స్టేటస్ లో పోస్ట్ చేసిన ఈ వీడియో క్షణాల్లో వైరల్ అయ్యింది. మోహన్ బాబు దృష్టికి వెళ్లడంతో డిలీట్ చేయించారు. ఈ వివాదం మీద మంచు విష్ణు, లక్ష్మి స్పందించారు. ఇది చిన్న గొడవ. మనోజ్ తెలిసీ తెలియక వీడియో సోషల్ మీడియాలో పెట్టారు. దీన్ని రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదన్నారు.

ఇక మంచు లక్ష్మి మాట్లాడుతూ... ప్రతి కుటుంబంలో చిన్న చిన్న గొడవలు ఉంటాయి. దీన్ని బూతద్దంలో చూడాల్సిన పని లేదు. నిజాలు తెలియకుండా కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అన్నదమ్ముల గొడవ త్వరలోనే పరిష్కారం అవుతుంది, అన్నారు. అయితే మనోజ్ శాంతించిన దాఖలాలు లేవు. నిన్న పరోక్షంగా విష్ణు మీద పోస్ట్స్ పెట్టారు. మీరు బ్రతకండి మమ్మల్ని బ్రతకనీయండి అంటూ... కొటేషన్స్ షేర్ చేశారు. మోహన్ బాబు మాత్రం మిన్నకుండిపోయారు. ఆయన మీడియా ముందుకు రాలేదు. 

ఈ క్రమంలో మోహన్ బాబు పాత వీడియో ఒకటి వైరల్ అవుతుంది. సదరు వీడియోలో మోహన్ బాబు తన స్పోర్ట్ విష్ణుకే మనోజ్ కి కాదని చెప్పాడు. గతంలో టాలీవుడ్ సెలబ్రిటీ లీగ్ జరిగింది. అందులో విష్ణు, మనోజ్ రెండు టీమ్స్ కి ప్రాతినిధ్యం వహించారు. అప్పుడు మీరు ఎవరి వైపని మోహన్ బాబుని అడగ్గా... నేనెప్పుడూ ధర్మం, న్యాయం వైపే ఉంటాను. నిజంగా ఇక్కడ కష్టపడింది విష్ణు టీమ్. మనోజ్ టీమ్ కాదు.. అన్నారు. దానికి పక్కనే ఉన్న తమ్మారెడ్డి భరద్వాజ్, మీరు వన్ సైడెడ్ గా చెప్తే ఎలా అన్నారు. 

నేను జీవితంలో ఎన్నడూ వన్ సైడెడ్ గా లేనని అన్నారు. మోహన్ బాబు కామెంట్స్ ని ఖండిస్తూ నటుడు బ్రహ్మానందం స్టేడియం లో కామెడీ చేశారు. ఇది అన్యాయం అంటూ ధ్వజమెత్తారు. ఒకప్పటి ఆ వీడియో వైరల్ గా మారింది. కొడుకుల విషయంలో మోహన్ బాబుకు కొంత పక్షపాతం ఉందేమో అన్న సందేహాలు ఉన్నాయి. పెద్ద కొడుకు విష్ణును దాదాపు రూ. 20 కోట్ల బడ్జెట్ తో భారీగా లాంచ్ చేశాడు. 2003లో అన్ని కోట్లు అంటే అది బాలయ్య, చిరంజీవి చిత్రాలకు మించిన బడ్జెట్. 

అదే సమయంలో మనోజ్ ని ఒక డబ్బింగ్ మూవీతో చాలా సాదాసీదాగా లాంచ్ చేశారు. అనూహ్యంగా విష్ణు డెబ్యూ మూవీ 'విష్ణు' అట్టర్ ప్లాప్ కాగా, మనోజ్ డెబ్యూ చిత్రం దొంగ దొంగది హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక ఇద్దరు అన్నదమ్ముల్లో ఎవరు మూవీ చేసినా మోహన్ బాబు డబ్బులు ఇవ్వాల్సిందే. జయాపజయాలతో సంబంధం లేకుండా విష్ణు చిత్రాలు చేస్తుంటే.. మనోజ్ కి ఐదేళ్ల గ్యాప్ వచ్చింది. మనోజ్ ప్రకటించిన పాన్ ఇండియా చిత్రం అహం బ్రహ్మస్మి మోహన్ బాబు సప్పోర్ట్ చేయలేదు. దాంతో ఆ ప్రాజెక్ట్ అటకెక్కింది. 

ఈ పరిణామాలు చూస్తుంటే చిన్న కొడుకు మనోజ్ కంటే పెద్ద కొడుకు విష్ణు మీద ఆయనకు మమకారం ఎక్కువనిపిస్తుంది. కాగా విష్ణు, మనోజ్ సొంత అన్నదమ్ములు కాదు. మోహన్ బాబు మొదటి భార్య సంతానం లక్ష్మి, విష్ణు కాగా... మనోజ్ రెండో భార్య కుమారుడు. అయితే విష్ణు, మనోజ్ తల్లులు సొంత అక్క చెల్లెళ్లు. 
 

click me!