ఎన్టీఆర్‌ తన భార్యని పిలిచే ముద్దు పేరేంటో తెలుసా? ప్రణతి పుట్టిన రోజున బయటపెట్టిన తారక్‌!

Published : Mar 26, 2023, 10:44 AM ISTUpdated : Mar 26, 2023, 11:08 AM IST
ఎన్టీఆర్‌ తన భార్యని పిలిచే ముద్దు పేరేంటో తెలుసా? ప్రణతి పుట్టిన రోజున బయటపెట్టిన తారక్‌!

సారాంశం

ఎన్టీఆర్‌కి అభిమానులు తారక్‌, యంగ్‌ టైగర్‌, జూ ఎన్టీఆర్‌, రామారావు అని పిలుస్తుంటారు. అయితే తన భార్యని తారక్‌ ఏమని పిలుస్తాడో తెలుసా? తాజాగా ఆ విషయాన్ని బయటపెట్టాడు ఎన్టీఆర్‌.   

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ఇప్పుడు గ్లోబల్‌ స్టార్‌ అయ్యాడు. `ఆర్‌ఆర్‌ఆర్‌` ఆయన ఇమేజ్‌ ఇండియా దాటి పోయింది. ప్రపంచ ఆడియెన్స్ మాత్రమే కాదు, సెలబ్రిటీలు కూడా ఆయన నటనని అభినందిస్తున్నారు. ఆయనకు అభిమానులుగా మారుతున్నాయి. ఇంతటి ఇమేజ్‌ని సొంతం చేసుకున్న ఎన్టీఆర్‌ వ్యక్తిగా చాలా హుందాగా వ్యవరిస్తుండటం విశేషం. 

ఇదిలా ఉంటే ఎన్టీఆర్‌కి 2011లో మ్యారేజ్‌ జరిగింది. లక్ష్మి ప్రణతిని ఆయన వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు భార్గవ్‌ రామ్‌, అభయ్‌ రామ్‌. తారక్‌ భార్య ప్రణతి పూర్తి ప్రైవేట్‌ లైఫ్‌కే పరిమితం. ఆమె బయటకు పెద్దగా రారు. సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండరు. పూర్తి ఫ్యామిలీ లైఫ్‌కే పరిమితం అవుతున్నారు. అయితే ప్రణతిని తారక్ ఏమని పిలుస్తాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సహజంగా ఎవరైనా తన భార్యలను ముద్దుపేర్లతో పిలుస్తుంటారు. ఆ పేర్లతో తమ ప్రేమని వ్యక్తం చేస్తుంటారు. 

మరి ఎన్టీఆర్‌.. తన భార్య ప్రణతిని ఏమని పిలుస్తాడో రివీల్‌ అయ్యింది. ప్రణతిని ముద్దుగా అమ్ములు పిలుస్తాడనే విషయం బయటపడింది. నేడు(మార్చి 26) తన భార్య లక్ష్మీ ప్రణతి పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమెకి బర్త్ డే విషెస్‌ చెప్పాడు తారక్‌. ఇందులో `హ్యాపీ బర్త్ డే అమ్ములు` అని తెలిపారు. అయితే విషెష్‌ సింపుల్‌గానే చెప్పినా, ఓ రహస్యాన్ని బయటపెట్టాడు. ఇంట్లో భార్యని ఏమని పిలుస్తాడో వెల్లడించాడు. దీంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ప్రణతికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. అన్నా పార్టీ లేదా అంటున్నారు. అంతేకాదు వదినమ్మ పేరు భలే ఉందంటున్నారు. 

`ఆర్‌ఆర్‌ఆర్‌`తో గ్లోబల్‌ స్టార్‌గా మారిన ఎన్టీఆర్‌.. ఈ సినిమా రిలీజ్‌ అయిన ఏడాది గ్యాప్‌తో కొత్త సినిమాని స్టార్ట్ చేశాడు. కొరటాల శివ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న `ఎన్టీఆర్‌30` చిత్రం ఇటీవలే ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇందులో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. భారీ కాస్టింగ్‌, టెక్నీషియన్లతో పాన్‌ ఇండియా మూవీగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. తీర ప్రాంతంలోని వదిలేయబడ్డ ఓ ఊరు నేపథ్యంలో `భయం` ప్రధానంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు కొరటాల శివ. చాలా వరకు వాటర్‌ బ్యాక్‌ డ్రాప్‌లోనే సినిమా సాగుతుందని తెలుస్తుంది. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్‌ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు