సినిమాను షురూ చేసిన స‌మంత

Published : Mar 08, 2017, 10:59 AM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
సినిమాను షురూ చేసిన స‌మంత

సారాంశం

జనతాగ్యారేజ్ తర్వాత మళ్లీ తెలుగు సినిమా సెట్స్ పైకిరాని స‌మంత  పూర్తిగా వ్యక్తిగత జీవితానికే టైమ్ కేటాయించిన అందాల భామ‌ మామ నాగార్జున‌తో క‌లిసి సినిమా షూటింగ్  ప్టార్ట్ చేసిన స‌మంత 

ఒకేసారి 2 తమిళ సినిమాలకు కాల్షీట్లు కేటాయించింది. దీంతో ఆమె మళ్లీ రామ్ చరణ్ సినిమాతోనే టాలీవుడ్ లో షూటింగ్ ప్రారంభిస్తుందని అంతా ఎక్స్ పెక్ట్ చేశారు. అయితే అంతలోనే ఆమె మరో తెలుగు సినిమా స్టార్ట్ చేసింది. అది కూడా తన కాబోయే మామగారితో కావడం విశేషం. రాజుగారి గది-2లో సమంత నటించనుందనే విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం నాగార్జున ఈ సినిమా షూటింగ్ లోనే బిజీగా ఉన్నాడు.

 ఇప్పుడు నాగ్ తో కలిసి సమంత కూడా జాయిన్ అయింది. ప్రస్తుతం నాగార్జున-సమంత మధ్య వచ్చే కొన్ని కీలకమైన సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. ఓంకార్ డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో మెంటలిస్ట్ గా కనిపించబోతున్నాడు నాగ్.10 రోజుల పాటు రాజుగారి గది-2 సినిమాకు కాల్షీట్లు ఇచ్చింది సమంత.

 ఆ తర్వాత చరణ్ సినిమాకు టైం కేటాయించింది. ఈనెల 22 నుంచి రామ్ చరణ్-సుకుమార్ సినిమాలో నటించనుంది. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ కోసం ఇప్పటికే కేరళలోని కొన్ని లొకేషన్లు ఫిక్స్ చేశారు. ప్రస్తుతం సమంత చేతిలో ఉన్న తెలుగు సినిమాలు ఈ రెండే.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి
Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?