Megastar Chiranjeevi : మెగాస్టార్ కు జంటగా జేజమ్మ.. క్రేజీ కాంబినేషన్ పై ఉత్కంఠ

Published : Jan 11, 2022, 01:51 PM IST
Megastar Chiranjeevi : మెగాస్టార్ కు జంటగా జేజమ్మ.. క్రేజీ కాంబినేషన్ పై ఉత్కంఠ

సారాంశం

టాలీవుడ్ హీరోయిన్లలో అనుష్క శెట్టి(Anushka Shetty )ది ప్రత్యేక స్తానం.  స్టార్ హీరోల సరసన.. స్టార్ హీరోయిన్ గా నటించి మెప్పించిన అనుష్క విమెన్ ఓరియెంటెడ్ మూవీస్ తో కూడా అలరించింది.

టాలీవుడ్ లో క్రేజీ కాంబినేషన్ సెట్ అవ్వబోతోంది. ఆడియన్స్  ఊహించని విధంగా మెగాస్టార్ చిరంజీవి సరసన హీరోయిన్ గా అనుష్క (Anushka Shetty) నటించబోతున్నట్టు తెలుస్తోంది. హీరోయిన్స్ లో అనుష్కది ప్రత్యేక స్థానం. ఆమె స్టార్ హీరోల సరసన స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది. ఆ తరువాత విమెన్ సెంట్రిక్ మూవీస్ లో హీరోగా ఎదిగింది. అరుంధతి,భగమతి లాంటి సినిమాలలో అనుష్క పెర్పామెన్స్ ముందు స్టార్ హీరోలు కూడా చిన్న బోయారు.

బాహుబలితో తన క్రేజ్ ను పదిలం చేసుకుంది అనుష్క(Anushka Shetty). సైజ్ జీరో లాంటి సినిమాలతో ప్రయోగాలు చేసి శభాష్ అనిపించుకున్న జేజమ్మ.. కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటుందో. నవీన్ పొలిశెట్టితో సినిమా ఒకటి లైన్ లో ఉండగా.. ఇఫ్పుడు మరో క్రేజీ కాంబినేషన్ గురించి న్యూస్ హల్ చల్ చేస్తోంది. మెగాస్టార్ చిరంజీవితో అనుష్క సినిమాను సెట్ చేసే పనిలో ఉన్నారు కొంత మంది మేకర్స్.

మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) వరుసగా సినిమాలు లైన్ లో పెడుతూ.. దూసుకుపోతున్నారు. మెగాస్టార్ ఆచార్యలో కాజల్ హీరోయిన్ గా నటించగా.. గాడ్ ఫాదర్ లో చిరు జోడిగా నయన తార మెరవబోతోంది. భోళా శంకర్ లో మెగా జోడీగా తమన్నా సందడి చేయబోతోంది. ఇక బాబీ డైరెక్షన్ లో తెరకెకుతోన్న సినిమాలో చిరంజీవి( Megastar Chiranjeevi) జంటగా శ్రుతి హాసన్ నటిస్తుంది. ఇలా మెగా మూవీస్ లో హీరోయిన్స్ ను కష్టపడి సెట్ చేశారు. ఇక రీసెంట్ గా వెంకీ కుడుముల తో కొత్త సినిమా ప్రకటించాడు మెగాస్టార్ .

Also Read :Renu Desai-Akira: పవన్ మాజీ భార్య రేణూ దేశాయ్ తోపాటు కొడుకు అకీరాకు కరోనా

ఈ సినిమాలో హీరోయిన్ గా అనుష్క శెట్టి(Anushka Shetty) అయితే బాగుంటుంది అనుకున్నారట. దాంతో ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న అనుష్కను ఒప్పించే ప్రయత్నంలో ఉన్నారట మేకర్స్.ఈ పనిని డైరెక్టర్ వెంకీ కుడుముల బాధ్యతగా తీసుకున్నట్టు తెలుస్తోంది.  ఎలాగైనా ఒప్పించింది సినిమా చేయాలని పట్టుదలతో ఉన్నారు. ఛలో సినిమాతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన వెంకీ కుడుములా.. భీష్మ సినిమాతో తన ప్లేస్ ను పదిలం చేసుకున్నాడు. ఇఫ్పుడు మెగా మూవీతో స్టార్స్ డైరెక్టర్లు సరసన చేరబోతున్నాడు.

Also Read :Ram Gopal Varma: మరో సంచలన ట్వీట్ చేసిన రామ్ గోపాల్ వర్మ.. ఏపీ ప్రభుత్వానికి స్ట్రాంగ్ కౌంటర్

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Kartik Aaryan: చెల్లి పెళ్లి వేడుకలో హంగామా చేసిన యంగ్ హీరో, సందడి మొత్తం అతడిదే.. వైరల్ ఫోటోస్
Radha Daughter: చిరంజీవి హీరోయిన్ కూతురు, గుర్తుపట్టలేనంతగా ఎలా మారిపోయిందో చూడండి