pushpa :“పుష్ప” ని కామెంట్ చేసిన, హీరో కార్తీ, బన్ని రిప్లై!

Surya Prakash   | Asianet News
Published : Jan 11, 2022, 12:57 PM IST
pushpa :“పుష్ప” ని కామెంట్ చేసిన, హీరో కార్తీ, బన్ని రిప్లై!

సారాంశం

చూసిన ప్రతీ ఒక్కరు సినిమాలో అల్లు అర్జున్ నటన అద్భుతం అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా తమిళ స్టార్ కార్తీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసాడు. 

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన సినిమా పుష్ప. తెలుగుతో పాటు అన్ని భాషల్లోనూ డిసెంబర్ 17న విడుదలైన ఈ చిత్రానికి మంచి టాక్ వచ్చింది. దానికి తగ్గట్లుగానే కలెక్షన్స్ కూడా వచ్చాయి. అఫీషియల్ గా 300 కోట్ల గ్రాస్ ఈ సినిమా వసూలు చేసిందని నిర్మాతలు ప్రకటించారు కూడా. పుష్ప సినిమాకు కలెక్షన్స్‌తో పాటు ప్రశంసలు కూడా అలాగే వస్తున్నాయి. చూసిన ప్రతీ ఒక్కరు సినిమాలో అల్లు అర్జున్ నటన అద్భుతం అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా తమిళ స్టార్ కార్తీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసాడు. 

 

కార్తి ట్వీట్ చేస్తూ...పుష్ప గా అల్లు అర్జున్ తన పాత్రలో పూర్తిగా ప్రవేశించాడని అరెస్టింగ్ పెర్ఫామెన్స్ తో అదరగొట్టేసాడని అలాగే సుకుమార్ సార్ అయితే ప్రతి మూమెంట్ ని మనుషులతో ప్రెజెంట్ చెయ్యడంలో టాప్ నాచ్ లో చూపిస్తారు. కాస్ట్ అండ్ క్రూ ఈ సినిమాకి ఫెంటాస్టిక్ జాబ్ అందించారని తెలిపాడు. మరి దీనికి గాను అల్లు అర్జున్ రిప్లై ఇస్తూ ధన్యవాదాలు తెలియజేసాడు. 

 

పుష్పలో అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. గతంలో అల్లు అర్జున్ సినిమాలు హిందీ డబ్బింగ్ వర్షన్ యూ ట్యూబ్‌లో విడుదలై మిలియన్స్ కొద్దీ వ్యూస్ అందుకున్నాయి. ఇప్పుడు థియేటర్స్‌లోనే పుష్ప అద్భుతమైన వసూళ్లు తీసుకురావడం అక్కడి ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యపరుస్తుంది. బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ పుష్ప సినిమా చూసి తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు.

 ఇప్పుడు ఎక్క‌డ చూసిన పుష్ప సినిమా గురించే చ‌ర్చ జ‌రుగుతంది. ఇక  హిందీ వెర్షన్ కోసం అక్కడ ఈ సినిమాను ప్రమోషన్‌ను చేసారు. దర్శకుడు సుకుమార్ లేకుండా.. అల్లు అర్జున్ అన్నీ తానై ఈ సినిమా ప్రమోషన్స్‌ను తన భుజాలపై మోస్తున్నాడనే చెప్పాలి. సుకుమార్ కూడా ఈ సినిమా కోసం లాస్ట్ వరకు కష్టపడ్డారు.  ఈ సినిమాపై అన్ని వర్గాలు మంచి రెస్పాన్స్ వస్తోంది.

Also Read : pushpa:'పుష్ప' సినిమాపై వైసీపీ నేత వివాదాస్పద 'కుల' వ్యాఖ్యలు
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

సపోర్ట్ చేసినందుకు వెన్నుపోటు పొడిచిన కళ్యాణ్, మనస్తాపానికి గురైన భరణి.. తనూజ ఏడుపు ఫేక్ అంటూ ముఖం మీదే
ఆ డైరెక్టర్ ఫోన్ చేసి ఐదుగురితో కమిట్‌మెంట్ అడిగాడు.. టాలీవుడ్ నటి ఓపెన్ స్టేట్‌మెంట్