#Anushka Shetty: అనుష్క ని ఆంటీ అంటాడా హీరో!?

Published : Nov 08, 2022, 07:11 AM IST
#Anushka Shetty: అనుష్క ని ఆంటీ అంటాడా  హీరో!?

సారాంశం

ఈ సినిమాలో ఇరవైఏళ్లు గ్యాప్ ఉన్న ఇద్దరి వ్యక్తులు మధ్య ప్రేమ పుట్టడం కథాంశం. హీరో కన్నా హీరోయిన్ పెద్దది కావటంతో ఆంటి పిలుస్తాడని, ఆమెతో ప్రేమలో పడిపోతాడని అంటున్నారు. 

సౌతిండియాలో స్టార్ హీరోయిన్ గా తన సత్తా చాటిన అనుష్క శెట్టి ఈ మధ్యన తన స్పీడుని తగ్గించింది . తెలుగు,తమిళ్ లో దాదాపు అందరు స్టార్ హీరోలతో సినిమాలు చేసిన ఆమె ఒంటి చేత్తో సినిమాలు నిలబెట్టకల సత్తా ఉంది. అందుకే  లేడీ ఓరియెంటెడ్ సినిమాలు 'అరుంధతి', 'భాగమతి' లాంటివి చేసింది. ఇక 'బాహుబలి'తో నెక్ట్స్ లెవిల్ లు కు వెళ్లింది. ఆ సినిమాతో ప్యాన్ ఇండియా పాపులారిటీ తెచ్చుకున్న ఈ బ్యూటీ గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంది. ఇప్పుడు  అనుష్క.. మళ్లీ సినిమాలు ఒప్పుకోవడం మొదలుపెట్టింది. అయితే తన వయస్సుకు తగ్గ పాత్రలే చేస్తుందని సమాచారం. 

యూవీ క్రియేషన్స్ లో అనుష్క ప్రధాన పాత్రలో నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. మహేష్.పి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. అనుష్కకు 48వ చిత్రమిది. 'మిర్చి', 'భాగమతి' విజయాల తర్వాత యూవీ క్రియేషన్స్ సంస్థలో ఆమె నటిస్తున్న హ్యాట్రిక్ సినిమా కావటంతో సినిమాపై మంచి అంచనాలు ఉంటాయి.  ఆమె సరికొత్త లుక్ లో కనిపించనున్నారు.  తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం మొత్తం నాలుగు దక్షిణాది భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకునే దాని ప్రకారం ఈ సినిమాలో ఇరవైఏళ్లు గ్యాప్ ఉన్న ఇద్దరి వ్యక్తులు మధ్య ప్రేమ పుట్టడం కథాంశం. హీరో కన్నా హీరోయిన్ పెద్దది కావటంతో ఆంటి పిలుస్తాడని, ఆమెతో ప్రేమలో పడిపోతాడని అంటున్నారు. 

 అనుష్క పుట్టినరోజు సందర్భంగా.. చిత్రటీమ్ ఒక పోస్టర్ ను రిలీజ్ చేసి అనుష్కకు బర్త్ డే విషెష్ తెలిపింది. పోస్టర్ లో అనుష్క చెఫ్ గెటప్ లో వంట
చేస్తూ కనిపించింది. సినిమాలో ఆమె అన్విత రవళి శెట్టి అనే పాత్రలో కనిపించనుంది. ఇదొక రొమాంటిక్ లవ్ స్టోరీ అంటున్నారు. ఇందులో అనుష్క కు పెళ్లి అంటే ఇష్టం ఉండదని, అందుకే అలా ఉండిపోతుందని, కానీ ఆమెను ఇష్టపడ్డ నవీన్ పోలిశెట్టి ఆమెను ఒప్పించేందుకు ప్రయత్నిస్తూంటాడని చెప్తున్నారు.అమితాబ్  చీనీకామ్ తరహాలో కథ రన్ అవుతుందని, మధ్యలో స్పెర్మ్ డొనేషన్  మ్యాటర్ కూడా ఉంటుందని చెప్తున్నారు. అయితే అసలు విషయం ఏంటనేది సినిమా రిలీజ్ అయితే కానీ తెలియదు. వచ్చే సంవత్సరమే ఈ సినిమా రిలీజ్ అవుతుంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Balakrishna: నిజమే, పవన్ కళ్యాణ్ కోసం బాలయ్య త్యాగం.. ఓజీ గెలిచింది ఇప్పుడు అఖండ 2 గెలవాలి
ఆరేళ్ల పాటు సహజీవనం చేసి, ఇద్దరు పిల్లలకు తండ్రయ్యాక నిశ్చితార్థం చేసుకున్న నటుడు