అర్జున్ రెడ్డి సినిమా విడుదలైన తర్వాత కరణ్ జోహార్ నాతో మాట్లాడటం జరిగింది. ఆ సినిమాతో పాటు అందులో నా నటన ఆయనకు బాగా నచ్చింది.. ఇక నాకు ఎప్పుడైనా హిందీలో సినిమా చేయాలనిపిస్తే.. ఆయనకు నాతో చేయాలని ఉంది అని అన్నారు.
చేసినవి కొద్ది సినిమాలే అయినా తెలుగులో సెన్సేషనల్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు విజయ్ దేవరకొండ. ‘అర్జున్ రెడ్డి’, ‘గీత గోవిందం’ లాంటి సూపర్ హిట్స్ అతడి ఖాతాలో ఉన్నాయి. అయితే ఈ మధ్యకాలంలో అతడు నటించిన సినిమాలేవీ వర్కవుట్ కావడం లేదు. భారీ అంచనాల మధ్య విడుదలైన ‘లైగర్’ సినిమా డిజాస్టర్ గా నిలవటం ఆయన అభిమానులను చాలా భాధించింది.ఈ సినిమాతో విజయ్ దేవరకొండ కూడా చాలా పోగొట్టుకున్నారు. సినిమా రిలీజ్ తరువాత రెమ్యునరేషన్ తీసుకుందామని కేవలం అడ్వాన్స్ మాత్రమే తీసుకున్నారట విజయ్. ఇప్పుడు సినిమా పోవడంతో విజయ్ కి ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ కూడా ఇవ్వడం లేదని కూడా చెప్తున్నారు. అయితే ఇంత నెగిటివ్ సిట్యువేషన్ లోనూ కొన్ని పాజిటివ్ లు ఉన్నారు.
‘లైగర్’ సినిమాను హిందీలో ప్రెజంట్ చేసిన కరణ్ జోహార్ మరోసారి విజయ్ తో సినిమా చేయాలనుకుంటున్నారట.విజయ్ ని తాను సరిగ్గా హిందీలో లాంచ్ చేయలేకపోయానని భావించిన కరణ్ ఇప్పుడు అతడికి మంచి ప్రాజెక్ట్ సెట్ చేయాలని చూస్తున్నారని సమాచారం. అందులో భాగంగా ఈ ఏడాది వరస హిందీ ఫ్లాఫ్ లకు బ్రేక్ వేసిన బ్రహ్మాస్త్ర సీక్వెల్ లో అవకాసం కల్పించబోతున్నారట.
బ్రహ్మాస్త్ర శివ పార్ట్ 1 ఇప్పటికే విడుదలైంది. తెలుగులో కూడా బ్రహ్మాస్త్రం పేరుతో రిలీజ్ అయింది, ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను అంతగా మెప్పించకపోయినా బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. మంచి వసూళ్లు కూడా రాబట్టింది. అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో రూపొందిన ఈ సినిమా మంచి టెక్నికల్ వాల్యూస్ తో ఇంట్రస్టింగ్ కథనంతో సాగింది.ఇప్పటికే ఈ సినిమా ఓటీటీలో విడుదలై మరోసారి ప్రేక్షకులను అందిస్తోంది. ఈ నేపధ్యంలో సినిమాకు సంబంధించిన రెండో భాగం మీద దృష్టి పెడుతున్నారు. ఈ రెండవ భాగం ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి.
మొదటి భాగం శివలో రణబీర్ కపూర్ శివ అనే పాత్రలో కనిపిస్తాడు. అతని తండ్రిగా దేవ్ అనే వ్యక్తి కనిపిస్తాడు. మొదటి భాగంలో దేవ్ ఎవరు అనే విషయం మీద క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఈ దేవ్ పాత్రలో నటించవలసిందిగా హృతిక్ రోషన్, రణవీర్ సింగ్ అలాగే సౌత్ స్టార్ హీరో యష్ ను కూడా మేకర్స్ సంప్రదించారు. అయితే వారెవరూ ఆ పాత్ర చేసేందుకు ఇంట్రస్ట్ చూపించలేదు. తాజాగా అందుతున్న సమాచారం మేరకు లైగర్ హీరో విజయ్ దేవరకొండను ఆ పాత్రలో నటించమని కోరినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాని లైగర్ నిర్మాత కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తోంది. విజయ్, కరణ్ జోహార్ కలిసి లైగర్ సినిమా కోసం పనిచేయడంతో ఒకరి గురించి ఒకరికి బాగా పరిచయం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే విజయ్ దేవరకొండను ఈ దేవ్ పాత్రలో నటించమని కోరినట్లుగా ప్రచారం జరుగుతోంది.
కరణ్ గురించి విజయ్ చెప్తూ....అర్జున్ రెడ్డి సినిమా విడుదలైన తర్వాత కరణ్ జోహార్ నాతో మాట్లాడటం జరిగింది. ఆ సినిమాతో పాటు అందులో నా నటన ఆయనకు బాగా నచ్చింది.. ఇక నాకు ఎప్పుడైనా హిందీలో సినిమా చేయాలనిపిస్తే.. ఆయనకు నాతో చేయాలని ఉంది అని అన్నారు. ఆ సమయంలో నేను హిందీ సినిమాలో నటించేందుకు రెడీగా ఉండేవాణ్ణి. ఈ క్రమంలో లైగర్ సినిమాను హిందీలో చేయాలనుకున్నప్పుడు ఆయనకు ఆ విషయం తెలియజేసాము. ఇక కథ వినకుండానే సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. కానీ మేమే ఒకసారి కథ వినిపించాము.. ఆయన ఎప్పుడూ నా ఆర్థిక , కుటుంబ నేపథ్యం గురించి అడగలేదు . కేవలం నన్ను ఒక నటుడిగా మాత్రమే స్వీకరించాడు. ప్రతిభను మెచ్చిట్ సినిమా చేయడానికి ముందుకు వచ్చారు అంటూ రౌడీ హీరో అన్నారు. అలా అప్పటి అనుబందం ఇప్పుడు ఉపయోగపడుతోంది అన్నమాట.