వీడేం ప్యాన్ రా నాయినా... బూతు వీడియోలు పంపాడు!

Published : Nov 08, 2022, 06:27 AM IST
వీడేం ప్యాన్ రా నాయినా... బూతు వీడియోలు పంపాడు!

సారాంశం

అదే అభిమానుల వల్ల కొన్ని చేదు ఎక్సపీరియన్స్ ఉన్నాయి. రీసెంట్ గా రవీనా టాండన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో   తన అభిమానుల వల్ల ఎదురైన చేదు అనుభవాలు వివరించింది.

వయసు పెరిగినా కొందరు కొంచెం కూడా వెనక్కి తగ్గరు. తమ అందాలతో దుమ్ము రేపుతూంటారు. అలాంటి మాజీ హీరోయిన్స్ లో  రవీనా టాండన్ ఒకరు. ఆమె వయస్సుతో పాటు అందం పెరిగిందే కానీ ఏ మాత్రం తగ్గలేదు. హిందీ, తమిళం చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీకు ఇప్పటికి అభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు..తెలుగులో బాలయ్యతో చేసిన  'బంగారు బుల్లోడు' సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఈ మధ్యన మళ్లీ కేజీయఫ్ చాప్టర్ 2లో ప్రేక్షకుల్ని మెప్పించింది .
  
1990 లలో బాలీవుడ్ ని తన గ్లామర్ తో ఓ ఊపు ఊపేసిన ఆమెకు  అప్పట్లో ఈమె క్రేజ్ ఇంతా అని చెప్పలేం. ఆ రోజులు గుర్తు చేసుకుంటే చాలా ఆనందమనిస్తుంది ఆమెకు. అయితే అదే అభిమానుల వల్ల కొన్ని చేదు ఎక్సపీరియన్స్ ఉన్నాయి. రీసెంట్ గా రవీనా టాండన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో   తన అభిమానుల వల్ల ఎదురైన చేదు అనుభవాలు వివరించింది.

రవీనా మాట్లాడుతూ.. “గతంలో ఓ అభిమాని రక్తంతో రాసిన లెటర్ లను మా ఇంటికి కొరియర్ చేశాడు. అవి మాత్రమే కాదు వాటితో పాటు అశ్లీల వీడియోలను కూడా పంపించాడు. అతని పిచ్చి చూసి నాకు చాలా భయం వేసింది. అటు తర్వాత ఓ రోజు నేను..నా భర్త, పిల్లలతో కలిసి కారులో ప్రయాణిస్తుండగా మేము ఆగాలని రాయి విసిరాడు.ఈ క్రమంలో నేను పోలీసులను ఆశ్రయించాను. 

ఇక రవీనాపై ప్రేమను నిరూపించుకోవడానికి ఒక అభిమాని ఏకంగా ఒకసారి ఆమె నివాసం గేటు బయట కూడా క్యాంప్ నిర్వహించాడని భయానకమైన పరిస్థితిని నటి వివరించింది. కేజీఎఫ్‌లో నటించిన రవీనా.. ప్రస్తుతం అర్బాజ్ ఖాన్ నిర్మాతగా వస్తున్న చిత్రం 'పట్నా శుక్లా'లో కనిపించనుంది. ఈ సినిమాలో సతీష్ కౌశిక్, మానవ్ విజ్, చందన్ రాయ్ సన్యాల్, జతిన్ గోస్వామి, అనుష్క కౌశిక్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?