15 ఏళ్ల తరువాత మరోసారి వార్తల్లో అరుంధతి సినిమా..

Published : Jan 16, 2024, 07:41 PM IST
15 ఏళ్ల తరువాత మరోసారి వార్తల్లో అరుంధతి సినిమా..

సారాంశం

అరుంధతి సినిమా ఒక అద్భుతం.. అనుష్కశెట్టి కెరీర్ లోనే బెస్ట్ అని చెపితే చాలాతక్కువే అవుతుంది. అంతకన్నా ఎక్కువ ఈసినిమా..? ఈసినిమా రిలీజ్ అయిన ఇన్నేళ్లకు మరోసారి వార్తల్లో నిలిచింది. 

దర్శక దిగ్గజం.. దర్శక మాంత్రికుడిగా పేరు తెచ్చుకున్నారు దివంగత  కోడి రామకృష్ణ. ఆయన కెరీర్ లో ఎన్నో సినిమాలు.. దాదాపు అన్ని సినిమాలు సూపర్ హిట్ అయినవే.. ఇక ఆయన కెరీర్ లో మరో కలికితురాయిగా నిలిచిన చిత్రంఅరుంధతి. అప్పటి వరకూ అందాలు ఆరబోస్తూ.. సొగసులతో కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తోన్న అనుష్కకి కొత్త ఇమేజ్ తీసుకొచ్చిందీ సినిమా.. అనుష్కలోని నటనా  సామర్ధ్యాన్ని వెలికి తీసి, ఆమె కెరీర్ ను టర్న్ చేసిన  సినిమా అరుంధతి. 

ఈసినిమా నుంచి అనుష్క కెరీర్ ఒక్క సారిగా డిఫరెంట్ టర్న్ తీసుకుంది. అందాల భామ అనుష్క.. జేజమ్మగా మారింది. లేడీ ఓరింటెండ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఆతరువాత  అనుష్క నటించిన “బాహుబలి, బాగమతి సినిమాలు కూడా అద్భుతైమన రెస్పాన్స్ ను సాధించడంతో.. అనుష్క సినిమాలు మానేసినా కాని.. ఆమె స్టార్ డమ్ మాత్రం అలాగే కొనసాగుతోంది.  అరుంధతి, జేజెమ్మ” పాత్రలలో అనుష్క కనబరిచిన అద్భుత అభినయం ఆబాలగోపాలాన్ని అలరించింది.

తెలుగు సినిమాకు గ్రాఫిక్స్ మాయాజాలాన్ని పరిచయం చేసిన దర్శక మాంత్రికుడు కోడి రామకృష్ణ తెరకెక్కించిన ఈ సినిమా  మరోసారి వార్తల్లో నిలిచింది.  అరుంధతి రిలీజ్ అయ్యి ఈరోజుకి.. (16 జనవరి) కి 15 ళఏళ్ళు అవుతుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు నందులు కైవసం చేసుకున్న “అరుంధతి” సరిగ్గా 15 ఏళ్ల క్రితం ఇదే రోజూ జనవరి 16, 2009లో విడుదలై, తెలుగు సినిమా చరిత్రలో ఎన్నటికీ చెరగని ముద్ర వేసింది. 

ఈసినిమాకు కగాను.. అనుష్కకు స్పెషల్ జ్యురి నంది అవార్డు సొంతయ్యింది. అరుంధతి గా అనుష్క..… పశుపతిగా మెప్పించిన సోనూ సూద్ కు ఉత్తమ విలన్, ఆర్ట్ డైరెక్టర్ అశోక్ కు ఉత్తమ కళా దర్శకుడు అవార్డులు గెలిచి పెట్టింది కోడి రామకృష్ణ దర్శకత్వంలో… రాజీ పడడం అన్నది ఎరుగని సుప్రసిద్ధ నిర్మాత ఎం.శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి నేటి రాజమౌళి ఆస్థాన ఛాయాగ్రాహకుడు కె.సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించగా… కోటి సంగీతం సమకూర్చారు. మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటర్.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Akhanda 2 New Date: అఖండ 2 మూవీ కొత్త రిలీజ్‌ డేట్‌.. బాలయ్య ఊహించని సర్‌ప్రైజ్‌, ఈ సినిమాలకు పెద్ద దెబ్బ
Venkatesh: `నువ్వు నాకు నచ్చావ్‌` మూవీతో పోటీ పడి చిత్తైపోయిన నాగార్జున, మోహన్‌ బాబు చిత్రాలివే