మెగా మనవరాలు క్లింకారపై సాంగ్, వీడియో వైరల్ ..

Published : Jan 16, 2024, 06:11 PM IST
మెగా మనవరాలు క్లింకారపై సాంగ్, వీడియో వైరల్ ..

సారాంశం

మెగా ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ .. రామ్ చరణ్  - ఉపాసనల గారాల పట్టి  క్లింకారకు స్పెషల్ గిప్ట్ వచ్చింది. అటు ఫ్యాన్స్ ను..ఇటు మెగా ఫ్యామిలీని సంతోపెట్టే విధంగా మెగామనవరాలి మీద ఓ సాంగ్ ను రిలీజ్ చేశారు.

మెగాస్టార్ చిరంజీవి మనుమరాలు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూతురు క్లింకారపై ఓ పాట రూపొందించబడింది. ఈసాంగ్ ప్రస్తుతం  యూట్యూబ్ లో వైరల్ గా మారింది. సంక్రాంతి పండుగ సందర్భంగా రాంచరణ్ భార్య ఉపాసన చేతుల మీదుగా ఈ పాట యూట్యూబ్ లో రిలీజ్ చేయబడింది. అయితే ఈపాటను మెగా ఫ్యామిల కోసం.. చిరంజీవిపై మరియు వారి కుటుంబంపై ఉన్న అభిమానంతో రచయిత, నిర్మాత, దర్శకుడు బెల్లంకొండ శ్రీధర్ (రఘు) దీనిని నిర్మించారు. 

అద్భుతమైన లిరిక్స కు అదరిపోయే మ్యూజిక్ సెట్ అవ్వడంతో.. మెగా ఫ్యాన్స్ ని ఈ సాంగ్ అలరిస్తోంది. కిలకిల నవ్వింది క్లింకారా.. అంటూ సాగే ఈ పాట శ్రీమతి ఉపాసనకు, మెగా ఫ్యామిలీ అభిమానులకు నచ్చడం తమ అదృష్టమని నిర్మాత శ్రీధర్ తెలిపారు. క్లింకార రాక మెగాస్టార్ ఇంటిని సంతోషాల పొదరిల్లుగా మార్చిందని, అభిమానులకు కనులపండుగలా చేసిందని నిర్మాత శ్రీధర్ చెప్పారు. మెగాస్టార్ ఇంటఆనందాలు నింపిన క్లింకారపై తాము రూపొందించిన పాట ఉపాసన కొణిదెలకు నచ్చడం తమ అదృష్టమని పేర్కొన్నారు. యూట్యూబ్ లో పాట విడుదల సందర్భంగా ఆయన ఈమేరకు సోమవారం ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు.

సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ పాటను ఉపాసన యూట్యూబ్ లో విడుదల చేశారని వివరించారు. ఈ పాటకు మహావీర్ యెల్లెందర్ సంగీతం అందించగా ధనుంజయ్ పాడారు. అనీల్ తోట, వీరబాబు కొంమూరి సహకారం అందించారని నిర్మాత శ్రీధర్ తెలిపారు. క్లింకారపై రూపొందించిన ఈ పాటను అందరికీ చేరువయ్యేందుకు అన్ని విధాలా సహకరించి అండగా నిలచిన రవణం స్వామినాయుడుకు బెల్లంకొండ శ్రీధర్ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Brahmamudi Serial Today Episode: బైక్ కోసం తమ్ముడిని ఇరికేంచేసిన రాజు, ఇందును అవమానించిన ఐశ్వర్య
Podarillu Today Episode మార్చి 18: మహాకు షాకిచ్చిన చక్రి, ఇలా అయితే వారికి విడాకులు రావడం కష్టమే