
‘గుంటూరు కారం’ థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. బాక్సాఫీస్ వద్ద కూడా మంచి కలెక్షన్లను రాబడుతోంది. ఇప్పటికే మూడు రోజుల్లో రూ.164 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. వీకెండ్ ఉండటంతో భారీ మార్క్ ను రీచ్ అయినట్టు తెలుస్తోంది. ఇక సినిమా థియేటర్లలో సందడి చేస్తుండటంతో యూనిట్ తాజాగా సక్సెస్ పార్టీని కూడా నిర్వహించింది.
శ్రీలీలా, మీనాక్షి చౌదరి, దిల్ రాజు, నాగవంశీ వేడుకల్లో సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇదిలా ఉంటే.. తాజాగా మహేశ్ బాబు Mahesh Babu, శ్రీలీలా Sreeleela ఇంటర్వ్యూ ఇచ్చారు. సుమ కనకాల ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా మహేశ్ బాబును బీడీ తాగడంపై ప్రశ్నించింది. ఇందుకు బాబు ఆసక్తికరంగా బదులిచ్చారు.
‘గుంటూరుకారం’లో బీడీ తాగే సీన్లలో నేను తాగింది రియల్ బీడీ కాదు. అసలు స్మోక్ చేయను. స్మోకింగ్ ను ఎంకరేజ్ కూడా చేయను. సినిమా కోసం మొదట మొదటిసారిగా షూటింగ్ లో ఒకసారి రియల్ బీడీ తాగాను. ఆ రోజంతా తల్లనొప్పిగా ఉంది. మైగ్రేన్ వచ్చేసింది. విషయం యూనిట్ కు చెప్పాను. ఆ తర్వాత ఆయుర్వేదిక్ బీడీని తీసుకొచ్చారు. సినిమా మొత్తం దాంతోనే నడిపించాం.... అంటూ చెప్పుకొచ్చారు. ఈ మూవీలోని మహేశ్ బాబు మాస్ స్టైల్ కు, డాన్స్ కు అభిమానులు మాత్రం ఫుల్ ఖుషీ అవుతున్నారు.