ప్రభాస్ ను వదిలి ఉండలేదట.. మనసులో మాట బయటపెట్టింది...

Published : May 05, 2017, 12:44 AM ISTUpdated : Mar 25, 2018, 11:48 PM IST
ప్రభాస్ ను వదిలి ఉండలేదట.. మనసులో మాట బయటపెట్టింది...

సారాంశం

మనసులోని మాట బయటపెట్టిన అనుష్క ప్రబాస్ ను వదిలి ఉండలేనంటున్న దేవసేన ప్రభాస్ తో తనకు విడదీయలేని బంధం ఏర్పడిందా?

బాహుబలి సినిమాతో ప్రభాస్ కు ఎంతటి క్రేజ్ వచ్చిందో ఆ సినిమాలో దేవసేన పాత్రలో నటించిన అనుష్కకు కూడా అంతే క్రేజ్ వచ్చింది. పైగా అనుష్క గతంలోనే పలు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించి క్రేజ్ సంపాదించుకుంది. హీరోయిన్స్ లో టాపర్ గా నిలిచిన అనుష్క బాహుబలిలో దేవసేన పాత్రలో నటించి మరో మెట్టు పైకెదిగింది. తనకు తిరుగులేదని నిరూపించింది. అయితే ఎంతటి దేవసేన అయినా, టాప్ హీరోయిన్ అయినా తనకీ మనసు అనేది ఒకటుంటుంది. దానికి కూడా ఎవరో ఒకరు నచ్చటం జరుగుతుంది.

 

ప్రస్థుతం దేశవ్యాప్తంగా అందరి కళ్లూ బాహుబలి వైప. ముఖ్యంగా అందులో నటించిన నటీనటులవైపే. అందులోనూ 5 ఏళ్ల పాటు సినిమా కోసం తమ సమయాన్నంతా కేటాయించిన హీరో ప్రభాస్, హీరోయిన్ అనుష్కల పెళ్లి గురించి అంతా చర్చ జరుగుతోంది. వీళ్లతోపాటు రానా గురించి కూడా చర్చ జరుగుతుందనుకోండి. ఇక వీళ్ల పెళ్లి మాట అటుంచితే ప్రస్థుతం టాలీవుడ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నేషనల్ స్టార్. నేషనల్ మీడియా కళ్లన్నీ ప్రభాస్ పైనే ఉన్నాయి. ఎలాగైనా ప్రభాస్ ను పట్టుకుని ఇంటర్వ్యూ కొట్టేద్దామని అంతా వేటాడుతున్నారు. అయితే ప్రభాస్ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా అమెరికాలో బాహుబలి సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు.

 

ఇదిలా ఉంటే అనుష్క తన మనసులో మాట వెల్లడించింది. ఇంతకీ అనుష్క మనసులో మాటేంటంటే ప్రభాస్ అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్తోంది. అతన్ని వదిలిపెట్టి ఉండలేనంత ఇష్టమంటోంది. భవిష్యత్తులో కూడా అవకాశాలు వస్తే అతనితో కలిసి సినిమాలు వదులుకోకుండా చేస్తానంటోంది. ప్రభాస్ తో నటించే అవకాశం వస్తే అస్సలు వదులుకునే ప్రసక్కే లేదంటోంది. అనుష్క ప్రస్థుతం ప్రభాస్ యువీ క్రియేషన్స్ బేనర్ లో భాగమతి సినిమాలో నటిస్తోంది.

 

ఇక గతంలో మిర్చి సినిమాలోనే ప్రభాస్ అనుష్కల జోడీకి బ్రహ్మరథం పట్టిన తెలుగు జనం బాహుబలి సినిమాతో ఏకంగా ప్రభాస్ అనుష్కలు మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కావాలని కోరుకుంటున్నారు. నెటిజన్లు ఏకంగా సోషల్ మీడియాలో తమ తమ అభిప్రాయాలు వెల్లడిస్తూ వీళ్లిద్దరూ ఒక్కటవాలనే సందేశం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభాస్ అంటే తనకు ఇష్టమని, అతన్ని వదిలి పెట్టలేనని చెప్పడం ఫిలింనగర్ లో చర్చకు తెరలెపింది. అయితే అది కేవలం స్నేహితుడిగానా, అంతకు మించా అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ ప్రశ్న.

 

 

PREV
click me!

Recommended Stories

ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టాల్సిన సినిమా, కానీ ఫ్లాప్..హీరోని తలుచుకుని రోజూ బాధపడే డైరెక్టర్ ఎవరంటే
Akhanda 2 Collections: అఖండ 2 మూవీ 10 రోజుల కలెక్షన్లు.. నెగటివ్‌ టాక్‌తోనూ క్రేజీ వసూళ్లు.. ఎంత నష్టమంటే