వాళ్లంతా రిజెక్ట్ చేసినా.. బెల్లంకొండ ఓకే చేశాడు!

Published : May 14, 2019, 04:57 PM IST
వాళ్లంతా రిజెక్ట్ చేసినా.. బెల్లంకొండ ఓకే చేశాడు!

సారాంశం

బెల్లంకొండ శ్రీనివాస్ తన కెరీర్ లో ఇప్పటివరకు భారీ బడ్జెట్ సినిమాలు చేసుకుంటూ వచ్చాడు.

బెల్లంకొండ శ్రీనివాస్ తన కెరీర్ లో ఇప్పటివరకు భారీ బడ్జెట్ సినిమాలు చేసుకుంటూ వచ్చాడు. మాస్ హీరోగా అతడిని ఎస్టాబ్లిష్ చేయాలని అతడితండ్రి బెల్లంకొండ సురేష్ ప్రయత్నిస్తున్నాడు. ఆ కారణంగానే పక్కా కమర్షియల్ సినిమాల్లో నటిస్తూ బి, సి ఆడియన్స్ కి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాడు. అతడి సినిమాల్లో హీరోయిజానికి ఢోకా ఉండదు. స్టార్ హీరోయిన్లు, భారీ కాస్టింగ్ ఉండేలా చూసుకుంటాడు.

అలాంటి హీరో 'సీత' లాంటి ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలో నటించడం కొందరిని ఆశ్చర్యపరిచింది. దర్శకుడు తేజ కథ మొత్తం చెప్పకుండా బెల్లంకొండని మోసం చేశాడనే  కామెంట్స్ కూడా వినిపించాయి. కానీ బెల్లంకొండ మాత్రం కథ ఒప్పుకొనే సినిమా చేశాడని అంటున్నాడు దర్శకుడు తేజ.

నిజానికి ఈ సినిమాలో హీరోగా ముందుగా బెల్లంకొండని తీసుకోవాలని అనుకోలేదట. ఇతర హీరోలను సంప్రదించగా.. వాళ్లెవరూ అంగీకరించకపోవడంతో అదే సమయంలో స్క్రిప్ట్ ని బెల్లంకొండకి వినిపించారట. ఈ విషయాన్ని తేజ స్వయంగా చెప్పుకొచ్చాడు. సినిమాలో హీరోయిన్ రోల్ కి ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుందని, ఆ కారణంగా తాను అడిగిన హీరోలెవరూ స్క్రిప్ట్ ఓకే చేయలేదని.. బెల్లంకొండ శ్రీనివాస్ ని అడిగితే మరో ఆలోచన పెట్టుకోకుండా ఈ సినిమా చేసినట్లు తేజ చెప్పాడు.

ఇప్పటివరకు కమర్షియల్ కథలతో లక్ పరీక్షించుకున్నా బెల్లంకొండకి సరైన సక్సెస్ రాలేదు. ఆ కారణంగానే తన బౌండరీస్ దాటి కొత్తగా ప్రయత్నిస్తున్నాడు. మరి ఈ సినిమాతో అయినా సక్సెస్ అందుకుంటాడేమో చూడాలి! 

PREV
click me!

Recommended Stories

Kalyan Padala Winner: కామన్ మ్యాన్‌దే బిగ్‌ బాస్‌ తెలుగు 9 టైటిల్‌.. బిగ్ బాస్‌ చరిత్రలో రెండోసారి సంచలనం
Demon Pavan: జాక్ పాట్ కొట్టిన డిమాన్ పవన్.. భారీ మొత్తం తీసుకుని విన్నర్ రేసు నుంచి అవుట్