అనుష్క డిజప్పాయింట్‌.. ఆ సినిమా ఓటీటీలో?

Published : Aug 19, 2020, 09:17 AM IST
అనుష్క డిజప్పాయింట్‌.. ఆ సినిమా ఓటీటీలో?

సారాంశం

`నిశ్శబ్దం` కూడా ఓటీటీలోనే విడుదలకాబోతుందంటూ వార్తలు వచ్చాయి. కానీ లేదు థియేటర్లనే విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు. 

అనుష్క రెండేళ్ళ గ్యాప్‌తో చేస్తున్న `నిశ్శబ్దం` సినిమాకి కష్టాలు వెంటాడుతున్నాయి. ఈ సినిమాతో మరోసారి సిల్వర్‌ స్క్రీన్‌పై తనేంటో చూపించాలనుకున్న అనుష్కకి నిరాశే ఎదురవుతుంది. హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సస్పెన్స్ హర్రర్‌ థ్రిల్లర్‌ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. సినిమా రిలీజ్‌కి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ఇక ప్రమోషన్‌ కూడా స్టార్‌ చేశారు. ఆ వెంటనే కరోనా విజృంభన.. లాక్‌డౌన్‌ వేయడం, థియేటర్లు మూత పడటం చకచకా జరిగిపోయాయి. 

ఇక అప్పట్నుంచి సినిమా విడుదలపై రకరకాల వార్తలు వస్తూనే ఉన్నాయి. రిలీజ్‌పై సస్పెన్స్ నెలకొంటూనే ఉంది. థియేటర్లు లేకపోవడంతో చాలా సినిమాలు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో విడుదలవుతున్నాయి. దీంతో `నిశ్శబ్దం` కూడా ఓటీటీలోనే విడుదలకాబోతుందంటూ వార్తలు వచ్చాయి. కానీ లేదు థియేటర్లనే విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు. 

కానీ ఈ సినిమా మొత్తానికి ఓటీటీలోనే విడుదల కాబోతుందంటూ వార్తలు మరోసారి గుప్పుమన్నాయి. అమేజాన్‌ ప్రైమ్‌లో ఇది విడుదల కానుందని, ఇప్పటికే డీల్‌ కూడా కుదిరిందని అంటున్నారు. అన్ని కుదిరితే ఇది వచ్చే నెలలోనే విడుదల కానుంది. మరి ఇది ఎంత వరకు నిజమనేది చూడాలి. ఇక ఇందులో అనుష్క మూగ ఆర్టిస్టుగా నటిస్తుండగా, మాధవన్‌ సెలబ్రిటీ మ్యూజీషియన్‌గా కనిపించనున్నారు. షాలినీ పాండే, అంజలి, సుబ్బరాజు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కోనవెంకట్‌, టీజీ విశ్వప్రసాద్‌
నిర్మిస్తున్నారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా