న్యూజిలాండ్‌లో అందరిని చంపేసి, తాను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడట

Published : Aug 19, 2020, 08:35 AM IST
న్యూజిలాండ్‌లో అందరిని చంపేసి, తాను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడట

సారాంశం

నాగబాబు అంతకంటే ముందే ఓ సారి తాను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడట. ఓ టీవీ షోలో తన కూతురు నిహారికతో కలిసి పాల్గొన్న నాగబాబు ఈ విషయాన్ని పంచుకున్నారు. ఆ సమయంలో న్యూజిలాండ్‌లోని అందరిని చంపేయాలనుకున్నాడట. ఇంతకి ఏం జరిగిందనేది చూస్తే. 

మెగా ఫ్యామిలీలో హీరోగా రాణించలేకపోయిన నటుడు నాగబాబు. పలు చిత్రాల్లో విలన్‌గానూ కనిపించినా మెప్పించలేకపోయాడు. ఇక క్యారెక్టర్‌ ఆర్టిస్ట్ గా మారిపోయి.. టీవీ హోస్ట్ గానూ, సీరియల్స్ తోనూ టెలివిజన్‌లోనూ ఫుల్‌ బిజీగా ఉన్నాడు. 

అయితే నాగబాబు.. తన అన్నయ్య చిరంజీవి తనయుడు, మెగా పవర్‌స్టార్‌ హీరోగా ఓ లవ్‌ స్టోరీ `ఆరేంజ్‌` సినిమాని నిర్మించిన విషయం తెలిసింది. ఆ సినిమా భారీ డిజాస్టర్‌ కావడంతో భారీగా అప్పుల్లో కూరుకుపోయిన నాగబాబు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు. ఇదే విషయాన్ని అనేక సందర్భాల్లో వెల్లడిచారు. ఆ సమయంలో తన అన్నయ్య చిరంజీవి, తమ్ముడు పవన్‌ ఆదుకున్నట్టు తెలిపారు. 

ఇదిలా ఉంటే నాగబాబు అంతకంటే ముందే ఓ సారి తాను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడట. ఓ టీవీ షోలో తన కూతురు నిహారికతో కలిసి పాల్గొన్న నాగబాబు ఈ విషయాన్ని పంచుకున్నారు. ఆ సమయంలో న్యూజిలాండ్‌లోని అందరిని చంపేయాలనుకున్నాడట. ఇంతకి ఏం జరిగిందనేది చూస్తే. 

నాగబాబు ఫ్యామిలీ అంతా కలిసి ఓ సారి న్యూజిలాండ్‌ వెళ్లాడు. అక్కడ తన లాంటి నల్లకోటు వేసుకున్న వ్యక్తితో నిహారిక వెళ్ళిపోయిందట. దీంతో 20 నిమిషాలపాటు వెతికారట. ఆ చుట్టు పక్కల ఎక్కడా నిహారిక కనిపించలేదు. దీంతో ఆయనకు పిచ్చెక్కిపోయిందని, వరుణ్‌ తేజ్‌ని ఇండియాకి పంపించి తాను, ఆయన భార్య పద్మ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారట.. ఎంతో పుణ్యం చేసుకుంటే ఏంజెల్స్ లాంటి కూతురు పుడతారని, నిహారిక తన ఏంజెల్‌` అని తెలిపి షోలో అందరి ఏడిపించాడు. అయితే నిహారిక ఎలా దొరికింది, అసలు అప్పుడు ఏం జరిగిందనేది సస్పెన్స్ లో పెట్టారు. ఆ షో ఈ నెల 23న ప్రసారం కానుంది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా