వైష్ణవ్ తేజ్ ప్రాజెక్ట్ కోసం ఆ నవల రైట్స్ తీసుకున్న క్రిష్

Published : Aug 19, 2020, 08:37 AM IST
వైష్ణవ్ తేజ్ ప్రాజెక్ట్ కోసం ఆ నవల రైట్స్ తీసుకున్న క్రిష్

సారాంశం

అందుతున్న సమాచారం మేరకు.. దర్శకుడు క్రిష్...ప్రముఖ నవలా రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన ‘కొండపొలం’ నవల రైట్స్ తీసుకున్నట్లు సమాచారం. పది లక్షల రూపాయలకు ఈ రైట్స్ తీసుకున్నట్లు చెప్తున్నారు. 2019లో ప్రచురితం అయిన ఈ నవలకు మంచి పేరు వచ్చింది. 2019లో వచ్చిన ఆయన నవల ‘కొండపాలం’  తానా  బహుమతి గెలుచుకుంది.

ఒకప్పుడు నవల రైట్స్ తీసుకుని సినిమాలు చేస్తూండేవారు. దాంతో ఎప్పటికప్పుడు కొత్త తరహా కథలు తెరకెక్కుతూండేవి. అదే సమయంలో సాహిత్యానికి ప్రోత్సాహం లభించినట్లు ఉండేది. అయితే నవల చదివి, దాని రైట్స్ తీసుకుని, నవలకు తగ్గ స్క్రీన్ ప్లే చేయటం ఓ పెద్ద పనిలా ఈ తరం మేకర్స్ భావించటం మొదలెట్టారు. దాంతో మెల్లిమెల్లిగా సినిమాకు,సాహిత్యం దూరమైపోయింది. కానీ అడపా, దడపా క్రిష్ వంటి సాహిత్సాభిలాషులు ఆ ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ఆయన ఓ నవల రైట్స్ తీసుకున్నట్లు సమాచారం. 

అందుతున్న సమాచారం మేరకు.. దర్శకుడు క్రిష్...ప్రముఖ నవలా రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన ‘కొండపొలం’ నవల రైట్స్ తీసుకున్నట్లు సమాచారం. పది లక్షల రూపాయలకు ఈ రైట్స్ తీసుకున్నట్లు చెప్తున్నారు. 2019లో ప్రచురితం అయిన ఈ నవలకు మంచి పేరు వచ్చింది. 2019లో వచ్చిన ఆయన నవల ‘కొండపాలం’  తానా  బహుమతి గెలుచుకుంది. త్వరలోనే ఈ నవలకు స్క్రీన్ ప్లే వెర్షన్ తో స్క్రిప్టు రాసి తెరకెక్కించాలని క్రిష్ భావిస్తున్నారు.  వైష్ణవ్ తేజ, రకుల్ ప్రీతి సింగ్ నటించేది ఈ సనిమాలోనే అని తెలుస్తోంది. సహజమైన పాత్రలతో ఈ సినిమా సాగుతుందని చెప్తున్నారు. 

 ఇంకా టైటిల్ ఫిక్స్ కాని ఈ చిత్రంలో అందాల భామ ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా న‌టిస్తోంది. సింగిల్ షెడ్యూల్ లో సినిమాను పూర్తి చేయాల‌ని కృత‌నిశ్చ‌యంతో ఉన్నాడ‌ట క్రిష్‌. 40 రోజుల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయ‌నున్న‌ట్టు ఫిలింన‌గ‌ర్ లో వార్త చ‌క్క‌ర్లు కొడుతోంది. ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్‌టైన్ మెంట్ బ్యాన‌ర్ పై సాయిబాబు జాగ‌ర్లమూడి, రాజీవ్ రెడ్డి సంయుక్తంగా ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు.  

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా