
అఆ..తో తెలుగులో అరంగేట్రం చేసిన మలయాళీ సుందరి అనుపమ పరమేశ్వరన్. ఆ తర్వాత ప్రేమమ్ తో మరో సూపర్ హిట్ కొట్టింది. ఈ సంక్రాంతికి వచ్చిన శతమానం భవతితో బ్లాక్ బస్టర్ సాధించి.. హ్యాట్రిక్ హిట్ కొట్టేసింది అనుపమ. ఈ బ్యూటీకి టాలీవుడ్ లో లక్కీ బ్యూటీ అనే పేరు వచ్చేసింది. అయినా చాన్సులు మాత్రం రావటం లేదు. అలా ఆమెను దూరం పెట్టటానికి దర్శకులు, నిర్మాతలు చెప్తున్న కారణం కూడా సిల్లీగానే అనిపిస్తోంది.
ఆన్ స్క్రీన్ పై అందాల ఆరబోత విషయంలో అనుపమ కొన్ని రిస్ట్రిక్షన్స్ పెడుతందనే టాక్ ఉంది. అందుకే రామ్ చరణ్-సుకుమార్ సినిమాలోను.. నాని మూవీలోను అవకాశం కోల్పోయిందని టాక్. ఆ విషయంపై స్పష్టంగా చెప్పలేం కానీ.. ఆఫ్ స్క్రీన్ లో మాత్రం అమ్మడు ఓ రేంజ్ లో మతిపోగొట్టేస్తోంది.
శతమానం భవతి సక్సెస్ మీట్ కు చక్కగా పద్ధతిగా తెలుగమ్మాయి టైపులో చీరకట్టులో వచ్చేసి తెలుగులో మాట్లాడేసింది అనుపమ. కానీ చీరకట్టులో ఎన్నేసి అందాలను చూపించచ్చో.. ఎంత గ్లామర్ ఒలికించచ్చో.. ఆ మొత్తం పలికించేసింది. అయితే ఎంత అందం ఒలకబోసినా, లక్కీ బ్యూటీ అనిపించుకున్నా.. అవకాశాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి.
అందంగా లేకపోతేనే, నటించడం రాకపోతేనే హీరోయిన్‌గా అవకాశాలు రాకపోవచ్చు. కానీ ఓ హీరోయిన్ విషయంలో ఆమె ఎత్తు ఆమెకు శాపంగా మారిందట! తెలుగులో చేసినవి తక్కువ సినిమాలే అయినా ఎక్కువ పేరు తెచ్చుకున్న హీరోయిన్‌గా అనుపమా పరమేశ్వరన్‌కు మంచి పేరుంది. అయితే ఆమె ఎత్తు తక్కువగా ఉండడం, టాలీవుడ్‌లో అందరూ హీరోలు దాదాపు ఆరడుగులు ఎత్తు ఉండడంతో వారి పక్కన అనుపమ మరీ పొట్టిగా కనిపిస్తుందని ఆమెకు అవకాశాలు ఇవ్వడం లేదట!
తెలుగులో ‘శతమానంభవతి' తరువాత అనుపమ కొందరు దర్శకులను కలిసి అవకాశావలు అడిగితే నువ్వు పొట్టిగా ఉన్నావు కనుక ఛాన్సులు ఇవ్వడం కుదరదు అని ముఖం మీదే చెప్పేశారట. వారి మాటలకు నొచ్చుకున్న అనుపమ ఇక ఎవరినీ ఛాన్సుల గురించి అడగకూడదని నిర్ణయించుకుందట! వారంతట వారుగా వస్తే తప్ప సినిమాలు చేయకూడదనిన డిసైడ్ అయిందట! రామ్ చరణ్ వంటి పెద్ద హీరోతో సినిమాలో చాన్స్ వచ్చినట్లే వచ్చి చివరి నిముషంలో చేజారిపోవడంతో కాస్త షాక్ తిన్నా.. మెచ్యూరిటీ ప్రదర్శించి హుందాగా వైఫల్యాన్ని అంగీకరించడమే కాదు.. ఆ చిత్ర దర్శకుల మంచివారే అని కామెంట్ కూడా చేసి పాజిటివ్ మార్కులు కొట్టేసింది.
హైట్ కారణం తో నిత్యామీనన్ కి కూడా కొందరు హీరోలు నో చెప్పిన సంగతి తెలిసిందే. పాపం ఇప్పుడు అనుపమ కూడా ఇదే కారణంగా తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ కాలేకపోవడం బాధాకరం.