HBD Anupama:'బటర్‌ఫ్లై' గా మారిన అనుపమ... ఆసక్తి రేపుతున్న ఫస్ట్ లుక్ పోస్టర్!

Published : Feb 18, 2022, 11:35 AM IST
HBD Anupama:'బటర్‌ఫ్లై' గా మారిన అనుపమ... ఆసక్తి రేపుతున్న ఫస్ట్ లుక్ పోస్టర్!

సారాంశం

బర్త్ డే పురస్కరించుకొని అనుపమ కొత్త చిత్రం 'బటర్‌ఫ్లై' (Butterfly)నుండి అప్డేట్ వచ్చింది. బటర్‌ఫ్లై ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయగా ఆకట్టుకుంటుంది.


యంగ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran birthday)పుట్టినరోజు నేడు. 1996 ఫిబ్రవరి 18న కేరళలో జన్మించిన అనుపమ తన 26వ ఏట అడుగుపెట్టారు. క్యూట్ హీరోయిన్ గా టాలీవుడ్ కుర్రాళ్ళ గుండెల్లో గూడు కట్టుకున్న అనుపమ క్రేజ్ కొనసాగుతుంది. లాక్ డౌన్ కారణంగా అనుపమ కెరీర్ నెమ్మదించగా... మరలా జోరందుకున్న ఛాయలు కనిపిస్తున్నాయి. అనుపమ వరుస చిత్రాలు ప్రకటిస్తున్నారు.

బర్త్ డే పురస్కరించుకొని అనుపమ కొత్త చిత్రం 'బటర్‌ఫ్లై' (Butterfly)నుండి అప్డేట్ వచ్చింది. బటర్‌ఫ్లై ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయగా ఆకట్టుకుంటుంది. ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ లో అనుపమ గెటప్, లుక్ చూస్తుంటే ఇది ఓ ఇంటెన్స్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కనుందనిపిస్తుంది. అనుపమ లుక్ చాలా సీరియస్ అండ్ డీప్ గా ఉంది. అనుపమ ప్రధాన పాత్రలో లేడీ ఓరియెంట్ చిత్రంగా బటర్‌ఫ్లై తెరకెక్కుతోందని సమాచారం. మొత్తంగా బటర్‌ఫ్లై ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలు పెంచేసింది. 

  బటర్‌ఫ్లై చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం ఘంటా సతీష్‌బాబు. రవిప్రకాష్ బోడపాటి, ప్రసాద్ తిరువళ్లూరి, ప్రదీప్ నల్లిమెల్లి నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమా జెన్ నెక్ట్స్ మూవీస్ బ్యానర్‌పై రూపొందుతోంది. బటర్‌ఫ్లైకి సమీర్ రెడ్డి ఫోటోగ్రఫీ డైరెక్టర్. చిత్ర షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.  

అలాగే అనుపమ తెలుగులో నిఖిల్ కి జంటగా '18 పేజెస్' మూవీ చేస్తున్నారు. ఇది రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. అలాగే నిఖిల్ మరొక చిత్రం కార్తికేయ 2లో కూడా అనుపమ ఆయనకు జంటగా నటిస్తున్నట్లు సమాచారం. వరుస పరాజయాలతో అనుపమ రేసులో వెనుకబడ్డారు. ఈ కొత్త చిత్రాల ఫలితాలపైనే అనుపమ భవిష్యత్తు ఆధారపడి ఉంది. 
 

PREV
click me!

Recommended Stories

Bigg Boss 9: పాపం ఇమ్మాన్యుయల్... టాప్ 3 కూడా మిస్, ఖుషీలో డీమాన్ పవన్
Sanjana Eliminated : బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే రేసు నుంచి సంజన ఔట్, నలుగురిలో నెక్స్ట్ ఎలిమినేషన్ ఎవరంటే?