Sebastian Movie : ‘సెబాస్టియన్ పీసీ 524’ మూవీ ఫస్ట్ సింగిల్ అవుట్.. ‘హేలి’ ఆకట్టుకుంటోంది..

Published : Feb 18, 2022, 10:22 AM IST
Sebastian Movie : ‘సెబాస్టియన్ పీసీ 524’ మూవీ ఫస్ట్ సింగిల్ అవుట్.. ‘హేలి’ ఆకట్టుకుంటోంది..

సారాంశం

యంగ్ హీరో కిరణ్‌ అబ్బవరం (Kiran Abbavaram) ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘సెబాస్టియన్ పీసీ 524’. ఈనెల 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా మూవీ నుంచి ‘హేలి’ టైటిల్ తో ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయ్యి ఆకట్టుకుంటోంది.   

‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ ఫేమ్ కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన తాజా చిత్రం ‘సెబాస్టియన్‌ పీసీ 524’. ఈ చిత్రానికి బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వం వహించారు. కోమలీ ప్రసాద్, నువేక్ష (నమ్రతా దరేకర్‌) హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎలైట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో సిద్ధారెడ్డి బి, జయచంద్రా రెడ్డి, రాజు, ప్రమోద్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు.  అయితే ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన ట్రైలర్ ఆడియెన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటోంది. రేచీకటి ఉన్న కానిస్టేబుల్‌ పాత్రలో పాత్రలో కిరణ్ తన నటనా నైపుణ్యాన్ని చూపించనున్నారు. తాజాగా మేకర్స్ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ‘హేలి’ని   రిలీజ్ చేశారు. 

సినిమాకు సంబంధించిన రోమాంటిక్ సాంగ్ ‘హేలి’. ‘నీ మాట వింటే రాదా మైమరపే... హేలి’ అంటూ సాగే పాట వినసొంపుగా, గుండెను మీటినట్టుగా ఉంది. ఈ సాంగ్ కు మ్యూజిక్ జిబ్రాన్‌ అందించగా, సనపాటి భరద్వాజ పాత్రుడు లిరిక్స్ అందించారు. కపిల్‌ కపిలాన్‌ గాత్ర దానం చేశారు. ఈ సాంగ్ వీడియోలో కిరణ్, నువేక్ష కెమిస్ట్రీ యూత్ ను బాగా ఆకట్టుకుటోంది. మరోవైపు సినిమాలో హీరోహీరోయిన్లు ప్రేమలో పడే సన్నివేశాలను చూపించారు. 

 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Powerstar Pawan Kalyan)కు కిరణ్ అబ్బవరం వీర అభిమాని. అయితే  ఈయన నటించిన సెబాస్టియన్ పీసీ 524 ( Sebastian Pc 524) మూవీ కూడా పవన్ కళ్యాణ్ నటించిన ‘భీమ్లా నాయక్’ (Bheemla Nayak) మూవీ రిలీజ్ అవుతున్న ఫిబ్రవరి 25నే రిలీజ్ కానుంది. ఈ మేరకు కిరణ్ అబ్బవరం ఎంతమేరకు తట్టుకోగలడో చూడాలని పలువురు అంటున్నారు. మరోవైపు ఓ ఇంటర్వూలో కిరణ్ మాట్లాడుతూ ఈ రెండు సినిమాలు ఒకే రోజు రిలీజైన తన మొదట ‘భీమ్లా నాయక్’ మూవీనే ఫస్ట్ షో చూస్తానని చెప్పాడు.  
 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?