
ప్రముఖ దర్శకుడు మధుర్ భండార్కర్ తన తదుపరి చిత్రాన్ని ప్రకటించారు. మిల్కీబ్యూటీగా అనేక ప్రేక్షకుల్ని సంపాదించుకున్న తమన్నాతో బబ్లీ బౌన్సర్ అనే బాక్సింగ్ నేపథ్యం ఉన్న చిత్రాన్ని ముధర్ భండార్కర్ తెరకెక్కిస్తున్నారు. ఫాక్స్ స్టార్ స్టూడియోస్, జంగ్లీ పిక్చర్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ఈ రోజు పూజా కార్యక్రమాలతో మొదలైంది.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మధుర్ భండార్కర్ మాట్లాడుతూ గతంలో తాను తెరకెక్కించిన సినిమాలకు భిన్నంగా బబ్లీ బౌన్సర్ ఉండనుందని తెలిపారు. బాక్సర్స్ టౌన్ గా పేరుగాంచిన అసోలా ఫతైపూర్ బ్యాక్ డ్రాప్ లో బాక్సింగ్ నేపథ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లుగా తెలిపారు. మిల్కీబ్యూటీ తమన్నా ఈ సినిమాలో ఓ మహిళ బౌన్సర్ గా నటిస్తున్నారని చెప్పారు. భారతదేశంలో తొలిసారిగా ఓ మహిళ బౌన్సర్ కథ ఆధారంగా వస్తున్న సినిమా ఇదన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని మధుర్ పేర్కొన్నారు.
అనంతరం హీరోయిన్ తమన్నా మట్లాడుతూ తన కెరీర్ లో తొలిసారిగా ఓ బౌన్సర్ పాత్రలో కనిపించడం చాలా ఆనందంగా అనిపిస్తోంది, ఓ ఛాలెంజ్ గా తీసుకొని ఈ సినిమాలో నటించడానికి అంగీకరించాను. మధుర్ దర్శకత్వంలో తొలిసారిగా నటించడం చాలా ఉత్కంఠగా ఉంది. ఈ సినిమాతో నన్ను ప్రేక్షకులు మరింతగా ఆదరిస్తారని అశిస్తున్నట్లుగా తెలిపారు.
కాగా ఈ మూవీకి మధుర్ భండాస్కర్ దర్శకత్వం వహిస్తుండగా.. కథ, స్క్రీన్ ప్లే ను అమిత్ జోషి, ఆరాధన, మధుర్ కూడా బాధ్యత వహించనున్నారు. ఈ ఏడాది చివరిలో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. ‘తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. డ్యాన్సర్ గా పలు సినిమాల్లో తన ప్రతిభ చూపించిన తమన్నా.. మొదటి సారి బ్యాక్సర్ గా ప్రేక్షకులను అలరించనుంది. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ( Ajay Devagan) నటించిన హిమ్మత్ వాలా మూవీతో బాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది తమన్నా. ఈ ఏడాది తమన్నా నటించిన ‘ఎఫ్ 3’,‘గుర్తుందా శీతాకాలం’, ‘బబ్లీ బౌన్సర్’, ‘గని’ మూవీలు రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరించనున్నాయి.