Prema Entha Maduram: అను పరిస్థితి చూసి కుమిలిపోతున్న తల్లితండ్రులు.. అన్న కోసం నీరజ్ సర్ ప్రైజ్ ప్లాన్!

Published : Feb 28, 2023, 02:27 PM IST
Prema Entha Maduram: అను పరిస్థితి చూసి కుమిలిపోతున్న తల్లితండ్రులు.. అన్న కోసం నీరజ్ సర్ ప్రైజ్ ప్లాన్!

సారాంశం

Prema Entha Maduram: బుల్లితెరపై తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకొని మంచి రేటింగ్ లో దూసుకుపోతున్న సీరియల్ ప్రేమ ఎంత మధురం. ఇక ఈరోజు ఫిబ్రవరి 28వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.  

ఎపిసోడ్ ప్రారంభంలో సాంబడు చెప్పిన ప్లేస్ కి వస్తారు సుబ్బు దంపతులు. బుజ్జమ్మని ఎక్కడ చూసావు అంటూ కంగారుగా అడుగుతారు. ఇక్కడే చూశాను కలుద్దామని వెళ్ళే లోపల అదిగో ఆ ఇంట్లోకి వెళ్లిపోయింది నేను వెళ్తుంటే సెక్యూరిటీ వాడు ఆపేసాడు ఇక్కడ అనురాధ అని వాళ్ళు ఎవరూ లేరు అంటున్నాడు నాకేమీ అర్థం కావట్లేదు అందుకే మీకు ఫోన్ చేశాను అంటాడు.

మన బుజ్జమ్మ వంటమనిషి ఏంటి, నువ్వు ఎవరిని చూసి ఎవరో అనుకున్నావు అంటాడు సుబ్బు. మన అనురాధమ్మ నాకు తెలియదా అంటాడు సాంబడు. అంతగా అనుమానం ఎందుకు నేను సెక్యూరిటీ అతన్ని బ్రతిమాలి లోపలికి వెళ్తాను అంటూ  గేటు దగ్గరికి వచ్చి సెక్యూరిటీ కి ఏదో పెద్ద చెప్పి లోపలికి వెళ్తారు సుబ్బు దంపతులు. ఎక్కువసేపు ఉండొద్దు త్వరగా వచ్చేయండి అని పర్మిషన్ ఇస్తాడు సెక్యూరిటీ. వంట చేస్తున్న అనుని చూసి షాక్ అవుతారు  సుబ్బు దంపతులు.

నువ్వు ఇలా వంట మనిషిగా చేయడం ఏంటి అంటూ అనుని పట్టుకొని ఏడుస్తారు. అనుకోకుండా వాళ్లని అక్కడ చూసిన అను కంగారు పడిపోతుంది. మీ అత్తగారింట్లో సరియైన సమాధానం దొరకలేనప్పుడే నాకు ఏదో అనుమానం వచ్చింది కానీ ఇలా వంట మనిషిలా చూస్తాను అనుకోలేదు అంటూ ఏడుస్తుంది  పద్దు. నేను ఇక్కడున్నాను అని మీకు ఎలా తెలుసు అయినా ఎక్కడ మాట్లాడుకోవడం కాదు అంటూ బయటికి తీసుకెళ్లి జరిగిందంతా చెప్తుంది అను.

ఇంత జరిగాక కూడా మాకు చెప్పాలని అనిపించలేదా? ఆ ఇంటిని వదిలేసినంత మాత్రాన నీ ఇంటికి రాకూడదా, మీ అమ్మ నాన్న చచ్చిపోయారు అనుకున్నావా అంటూ కన్నీరు పెట్టుకుంటాడు సుబ్బు. నిజం తెలిస్తే ఇలా కంగారు పడిపోతారు అందుకనే చెప్పలేదు అంటుంది అను. నిన్ను ఇలాంటి పరిస్థితుల్లో చూడటానికేనా మేము బ్రతికున్నాము. నువ్వు, సారు మన బస్తీలో ఉండొచ్చు కదా అత్తగారింట్లో ఉండడానికి సార్ కి నామోషియా అంటుంది సుబ్బు. అలా అని కాదమ్మా మేము ఎక్కడున్నావో తెలియకుండా గుట్టుగా బ్రతుకుతున్నావు సార్ గురించి మీకు తెలిసిందే కదా అంటుంది అను.

నువ్వు ఒట్టి మనిషివి కూడా కాదు ఎన్నాళ్లిలా అంటాడు సుబ్బు. సార్ నన్ను బాగా చూసుకుంటున్నారు ఆయన కష్టపడుతూ నన్ను సుఖపెడుతున్నారు అంటుంది అను. ఇలా నాలుగేళ్ల పనిచేయడం కూడా సుఖమేనా అని పద్దు అంటే నేను ఇలా పని చేస్తున్నట్లు ఆయనకి తెలీదు ఆయన కష్టాన్ని పంచుకోటానికి ఇలా చేస్తున్నాను అంటుంది అను. ఇంకా చాలు సార్ దగ్గరికి వెళ్లి బస్తికి వెళ్దాము అని నేను బ్రతిమాలతాను వచ్చేదాకా ఊరుకోను అంటాడు సుబ్బు.

వద్దు మీరు ఆయన్ని ఇలాంటి పరిస్థితుల్లో చూడలేరు అంటుంది అను. మీ కళ్ళల్లోకి చూస్తూ ఆయన ఇబ్బంది పడితే ఆ బాధని నేను భరించలేను ఈ కష్టాలు కొన్ని రోజులే పరిస్థితులు చక్కపడితే అంత మామూలు అయిపోతుంది. దయచేసి సార్ కి ఎదురుపడకండి అంటూ తల్లిదండ్రులు ఇద్దరినీ ఒప్పిస్తుంది  అను. మరోవైపు ఏమైందిజెండే కాల్ చేసావా అని నీరజ్ అడుగుతాడు. అంటే చేశాను వస్తున్నారంట అంటాడు జెండే. అయినా మీరే డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా అనుకి సీమంతం అంటే ఆర్య కాదనడు కదా అంటాడు.

 దాదా ఒప్పుకోడు ఒకవేళ దాదా ఒప్పుకున్నా జరిగిన పరిస్థితులకి వదినమ్మ అసలు ఒప్పుకోదు అంటాడు నీరజ్. అప్పుడే అక్కడికి జనార్ధన్ అనే వ్యక్తి వస్తే అతన్ని నీరజ్ కి పరిచయం చేస్తాడు జెండే. ఇతనే రాజనందిని టెక్స్టైల్స్ డీలర్.  రీసెంట్గా అనుకూడా వెళ్లి షాపింగ్ లోనే షాపింగ్ చేసింది అని చెప్తాడు జెండే. ఇప్పుడు మీరు నాకు చేయవలసిన ఫెవర్ ఏంటంటే మీ షాపులో బట్టలు కొన్న మా వదినమ్మ వాళ్లకి ఓచర్ ద్వారా లక్కీ టిప్ లో సీమంతం చేస్తున్నట్లుగా చేయాలి ఏర్పాట్లన్నీ మేమే చేస్తాము.

కానీ అదంతా మీరే చేస్తున్నట్లుగా అందరూ అనుకోవాలి దాదాకి ఏ అనుమానం రాకుండా చూసుకోండి అంటూ రిక్వెస్ట్ చేస్తాడు నీరజ్. మీరు అంతలాగా రిక్వెస్ట్ చేయక్కర్లేదు జెండే నాకు అంత చెప్పారు సార్ ని ఒప్పించే బాధ్యత నాది అంటాడు జనార్ధన్. నీరజ్ థాంక్యూ చెప్తే ఉంటాను సర్ గుడ్ న్యూస్ తో ఫోన్ చేస్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు జనార్ధన్. ఆ మాటలకి ఆనందంతో పొంగిపోయిన నీరజ్ నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు, సిటీలో మంచి వెన్యూ సెలెక్ట్ చేయు వదినమ్మ కట్టుకునే చీర దగ్గర నుంచి డెకరేషన్ వరకు అన్ని గ్రాండ్ గా ఉండాలి.

ఇది దాదా,వదినమ్మల లైఫ్ లో బెస్ట్ మూమెంట్ గా ఉండాలి అంటూ ఎమోషనల్ అవుతాడు. మీకు దాదా వదినమ్మ అంటే ఎంత అభిమానం నాకు అర్థమైంది అలాగే అంటాడు జెండే. నా దృష్టిలో మీరు చాలా గొప్పగా కనిపిస్తున్నారు మీరు చెప్పినట్లుగానే గ్రాండ్గా ఏర్పాట్లు చేస్తాను అంటాడు జెండే. మరోవైపు గోడమీద నీడ ద్వారా ఆ బొమ్మలు ఏంటో చెప్పమంటాడు ఆర్య. చేతులు కదిలిస్తూ ఒక్కొక్క నీడతో ఒక్కొక్క బొమ్మని చేస్తాడు ఆర్య. చివరిగా చేతిలో బిడ్డని ఎత్తుకున్నట్లుగా చేతులతో షాడో పెడతాడు ఆర్య.

బేబీ అంటూ ఎమోషనల్ గా చెప్పింది అను. వాళ్లు అలా ఎంజాయ్ చేస్తూ ఉండగా జనార్ధన్ కి వచ్చి అపర్ణ గారి ఇల్లు ఇదేనా అని అడుగుతాడు మీరెవరు అని ఆర్య అంటే  మేము జాయ్ రెడీమేడ్ షో రూమ్ నుంచి వస్తున్నాము అపర్ణ గారు కొన్న బట్టలకి లక్కీ డిప్ తగిలింది. మీకు సెలబ్రేషన్ డిప్ వచ్చింది. మీకు సంబంధించిన పూర్తి అకేషన్ ని మేము సెలబ్రేట్ చేస్తాము అని చెప్తాడు జనార్ధన్. మాకు ఎలాంటి సెలబ్రేషన్స్ అవసరం లేదు ఎలాంటి అకేషన్స్ లేవు అంటాడు ఆర్య.

అలా రిఫ్యూజ్ చేయకండి మనం అనుకుంటే ఏదైనా అకేషనే.మేడం ప్రెగ్నెంట్ కదా సీమంతాన్ని గ్రాండ్గా సెలబ్రేట్ చేద్దాం అంటాడు జనార్ధన్. అలా అనేసరికి మీరే చేసిన అవమానం గుర్తొస్తుంది అనుకి. వుయ్ ఆర్ నాట్ ఇంట్రెస్టేడ్ అని అను అంటే ఒకసారి ఆలోచించండి మేడం సీమంతం అంటే ఎవరికైనా బెస్ట్ మూమెంట్, లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే బెస్ట్ మెమొరీ అవుతుంది అంటూ కన్విన్స్ చేస్తాడు. ఆ సీమంతం ఎలాగూ ఆగిపోయింది ఈ సీమంతం ద్వారా అయినా తనని సంతోష పెట్టాలి అనుకుంటూ వాళ్ళ ప్రపోజల్ కి ఒప్పుకుంటాడు ఆర్య.

నేను ఒక కండిషన్ మీద ఒప్పుకుంటున్నాను ఫంక్షన్ కి సంబంధించిన వీడియోలు కానీ ఫోటోలు కానీ ఎక్కడ పబ్లిష్ అవ్వకూడదు అంటాడు ఆర్య. సరే సరే డేట్ ఫిక్స్ చేసి మీకు డీటెయిల్స్ పంపిస్తాం అంటూ అక్కడి నుంచి బయలుదేరుతారు జనార్ధన్ వాళ్ళు. ఎందుకు ఒప్పుకున్నారు నాకు సీమంతం అంటేనే తెలియని దిగులు భయము పట్టుకున్నాయి అంటుంది అను. అమ్మ చెప్పింది కదా సీమంతం అంటే తల్లి బిడ్డల క్షేమం కోసం అని అందుకే మీ ఇద్దరి క్షేమం కోసం నేను ఒప్పుకున్నాను.

సీమంతం అనేది నీ జీవితంలో చేదు జ్ఞాపకంగా ఉండకూడదు అంటాడు ఆర్య. ఏదో చెప్పబోతున్న అనుని ఇంకే భయం పెట్టుకోకు అంతా మంచే జరుగుతుంది అంటూ ఆమెని కన్విన్స్ చేస్తాడు ఆర్య. జనార్ధన్ నీరజ్ కి ఫోన్ చేసి మీ దాదా ఒప్పుకున్నారు అని చెప్తాడు. ఆ మాటలకి ఆనందంతో ఎగ్జైట్  అవుతాడు నీరజ్. ఒకటికి పది సార్లు జనార్ధన్ కి థాంక్స్ చెప్తాడు. మీరు అంతగా రిక్వెస్ట్ చేశాక చేయకుండా ఉంటానా అంటాడు జనార్ధన్. దాదని వదినమ్మ ని వెన్యూ కి వచ్చేలాగా చేయండి చాలు మిగతాదంతా నేను చూసుకుంటాను అంటాడు నీరజ్.

ఆ మాటలకి సరే అంటాడు జనార్ధన్. ఇదంతా నేనే ప్లాన్ చేశాను అని దాదాకి తెలిస్తే ఏమంటారో ఏంటో, అయినా ప్రాబ్లం లేదు వదినమ్మ కి సీమంతం జరగాలి అదే ఇంపార్టెంట్ అనుకుంటూ జెండే కి కాల్ చేస్తాడు నీరజ్. సీమంతానికి అనుని  అందంగా ముస్తాబు చేస్తారు ఆడవాళ్లు. నిన్ను ఇలా చూసి మీ హస్బెండ్ ఏమంటారు అని అంటుండగానే అక్కడికి ఆర్య వస్తాడు. మేడం ఎలా ఉన్నారు చెప్పండి అంటుంది ఒక ఆవిడ. మా ఆవిడ ఎప్పుడు అందంగానే ఉంటుంది అంటాడు ఆర్య.

మీరు చెప్పండి మేడం సార్ ఎలా ఉన్నారు అని అనుని అడుగుతుంది ఒక ఆవిడ. మావారు ఎప్పుడు హ్యాండ్సమ్ గానే ఉంటారు కానీ ఈ డ్రెస్ లో ఇంకా క్యూట్ గా ఉన్నారు అంటుంది అను. మేము ఫోటోషూట్ కి ఏర్పాటు చేస్తాము మీరు రిలాక్స్ అవ్వండి అంటూ అందరూ అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అను, ఆర్య కి దిష్టి చుక్క పెట్టి మా ఆయనకి ఎవరి దిష్టి తగలకూడదు అంటుంది. ఆర్ యు హ్యాపీ అని అడుగుతాడు ఆర్య.

చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మీరన్నట్టు ఇది మనకి ఒక మంచి జ్ఞాపకం, పొట్టబోయే బేబీకి కూడా గర్వంగా చెప్పుకోవచ్చు అంటుంది అను. క్రౌన్ పెట్టలేదు ఏంటి అని ఆర్య అంటే మీ చేతులతో పెట్టించుకోవాలని వాళ్ళ చేత పెట్టించుకోలేదు అంటుంది అను. అవునవును మా మహారాణికి నేనే  క్రౌన్ పెడతాను అంటూ ఆమె తల మీద క్రౌన్ పెట్టి అద్దంలో చూసుకోమంటాడు. అద్దంలో చూసుకోమంటే ఎదురుగా ఉన్న ఆర్యని చూస్తుంది అను.

నాలో ఉన్న అందం అద్దంలో కంటే మీలోనే ఎక్కువగా కనిపిస్తుంది అంటుంది. నాకు అర్థం మీలాంటి బాబే పుడతాడు డేరింగ్ అండ్ డాషింగ్ గా ఉంటాడు అంటుంది అను. ఏం కాదు మనకి అందమైన పాప పుడుతుంది అచ్చు నీలాగే క్యూట్ గా ఏంజెల్ లాగా ఉంటుంది అంటాడు ఆర్య. బాబు అని అను, పాప అని ఆర్య ఇద్దరు గొడవ పడతారు. బై ఛాన్స్ పాప బాబు ఇద్దరూ పుడితే  అంటాడు ఆర్య. అలా జరిగితే అంతకంటే హ్యాపీనెస్ వేరొకటి ఉండదు వల్ల అలాగే జరగాలి అంటుంది అను. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో  చూద్దాం.

PREV
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?