హైపర్ ఆది పరువు తీసిన యాంకర్ సౌమ్య రావు.. వేదికపై హీటు పెంచేసిన జబర్దస్త్ వర్ష 

Published : Feb 28, 2023, 02:06 PM IST
హైపర్ ఆది పరువు తీసిన యాంకర్ సౌమ్య రావు.. వేదికపై హీటు పెంచేసిన జబర్దస్త్ వర్ష 

సారాంశం

పండుగలు, ప్రత్యేక సందర్భాలు ఏమొచ్చినా జబర్దస్త్ టీం, బుల్లితెర నటులు స్పెషల్ ఈవెంట్స్ తో రెడీ అయిపోతారు. త్వరలో హొలీ పండుగ సందర్భంగా వీరంతా ఫుల్ ఎంటర్టైనింగ్ ఎపిసోడ్ తో రాబోతున్నారు.

పండుగలు, ప్రత్యేక సందర్భాలు ఏమొచ్చినా జబర్దస్త్ టీం, బుల్లితెర నటులు స్పెషల్ ఈవెంట్స్ తో రెడీ అయిపోతారు. త్వరలో హొలీ పండుగ సందర్భంగా వీరంతా ఫుల్ ఎంటర్టైనింగ్ ఎపిసోడ్ తో రాబోతున్నారు. ఈ ఈవెంట్ పేరు ' గుండె జారీ గల్లంతయ్యిందే'. ఈ ఈవెంట్ కి సీనియర్ హీరోయిన్ శ్రీదేవి విజయ్ కుమార్ అతిథిగా హాజరయ్యారు. ఈ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ఈ స్పెషల్ ఈవెంట్ లో హైపర్ ఆది, సౌమ్య రావు, వర్ష, యాంకర్ రవి, జబర్దస్త్ నరేష్ తో పాటు బుల్లితెర ప్రముఖులు కూడా పాల్గొంటున్నారు. కార్తీక దీపం హీరో నిరుపమ్ కూడా పాల్గొంటుండడం విశేషం. వీరంతా మామూలు రచ్చ చేయలేదు. కామెడీ స్టంట్స్ చేస్తూనే హెట్టెక్కించేలా డ్యాన్స్ పెర్ఫామెన్స్ లతో కూడా ఆకట్టుకున్నారు. 

స్టేజి పైకి బైక్ తీసుకువస్తాం.. దానిపై సౌమ్యని హైపర్ అది ఒక రౌండ్ తిప్పాలి అని యాంకర్ రవి ఫిట్టింగ్ పెడతాడు. సౌమ్యకి ధైర్యం ఉంటే నాతో బైక్ ఎక్కొచ్చు అని హైపర్ ఆది అంటాడు. బైక్ నడపడంలో హైపర్ ఆది వీక్ అని ఇప్పటికే పలు సందర్భాల్లో తేలింది. 

సౌమ్య ధైర్యం చేసి బైక్ ఎక్కుతుంది. కానీ హైపర్ ఆది భయపడుతూ బైక్ డ్రైవ్ చేస్తాడు. సౌమ్యని పడేయబోతాడు. దీనితో సౌమ్య కిందకి దిగి.. నీకు యాక్టింగ్ రాదు, కామెడీ రాదు.. డ్యాన్స్ రాదు.. కనీసం బైక్ నడపడం కూడా రాదా అని అందరి ముందు పరువుతీస్తుంది. 

ఇక యాంకర్ సౌమ్య రావు, జబర్దస్త్ వర్ష , భాను ముగ్గరూ కల్సి ధృవ చిత్రంలోని.. ప్యారులో పడిపోతే పరేషాను రా అనే సాంగ్ కి హీటు పుట్టించేలా డ్యాన్స్ తో అదరగొట్టారు. వేళ్ళు వేసిన డ్యాన్స్ మూమెంట్స్ కుర్రాళ్ల హృదయాలు జారిపోయే విధంగా ఉన్నాయి. ముగ్గురూ రెడ్ కలర్ కాస్ట్యూమ్స్ లోనే హాట్ హాట్ గా కనిపించారు. ఈ కంప్లీట్ ఎపిసోడ్ మార్చి 5న ప్రసారం కానుంది. 

PREV
click me!

Recommended Stories

Krishnam Raju: చిరంజీవి ఇలా మనసు పడ్డాడో లేదో, మెడలో ఖరీదైన గిఫ్ట్ పెట్టిన కృష్ణంరాజు.. మర్చిపోలేని బర్త్ డే
మడత మంచం పై పడుకొని, ప్రకృతిని ఆస్వాదిస్తున్న అనసూయ