విజయ్ ‘లియో’ ప్రీ రిలీజ్ బిజినెస్ అన్ని వందల కోట్లా? భారీ ధరకు డిజిటల్, శాటిలైట్ రైట్స్?

By Asianet News  |  First Published Feb 28, 2023, 1:55 PM IST

తమిళ స్టార్ విజయ్ దళపతి నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ ‘లియో’ (Leo). లోకేషన్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అయితే విడుదలకు ముందే షాకింగ్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టు తెలుస్తోంది.
 


తమిళ స్టార్ విజయ్ దళపతి (Vijay Thalapathy) రీసెంట్ గా వారసుడుతో మంచి సక్సెస్ ను అందుకున్నారు. ప్రస్తుతం సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘లియో’ చిత్రంలో నటిస్తున్న  విషయం తెలిసిందే. ప్రముఖ సెవెన్ స్కీన్స్ బ్యానర్ పై నిర్మాతలు ఎస్ఎస్ లలిత్ కుమార్, జగదీష్ పళానిసామి రూ.200 కోట్లతో తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ చిత్రాన్ని ప్రకటించినప్పటి నుంచి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గ్గా నిలుస్తూనే ఉంది. ఈ సందర్భంగా తాజాగా షాకి్ంగ్ డిటేయిల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

‘ఖైదీ’,‘విక్రమ్’ చిత్రాలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన Lokesh Kangaraj దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజా సమాచారం ప్రకారం.. ‘లియో’ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.400 కోట్ల వరకు అయినట్టు తెలుస్తోంది.  విడుదలకు ముందే వసూళ్ల పరంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తుండటంతో సినిమాపై మరింత ఆసక్తినెలకొంది. తమిళ ఇండస్ట్రీలో అత్యధిక ప్రీరిలీజ్ బిజినెస్ ను సాధించిన చిత్రంగా ఈసినిమా ఇప్పుడే రికార్డు క్రియేట్ చేస్తోంది.  

Latest Videos

మరింత సమాచారం ప్రకారం.. చిత్రానికి సంబంధించిన శాటిలైట్, డిజిటల్, మ్యూజిక్ అండ్ థియేట్రికల్ రైట్స్ విక్రయించగా ఈ భారీ మొత్తం వసూలైనట్టు తెలుస్తోంది.  నెట్ ఫ్లిక్స్ రూ.120 కోట్లతో (తమిళం, తెలుగు, హిందీ, కన్నడ) డిజిటల్ రైట్స్ ను కొనుగోలు చేసిందని అంటున్నారు. మరోవైపు శాటిలైట్ రైట్స్ ను సన్ టీవీ రూ.70 కోట్లు దక్కించుకుందని టాక్. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ అందిస్తున్న  సంగీతాన్ని సోనీ మ్యూజిక్ రూ.18 కోట్లకకు దక్కించుకున్నట్టు తెలుస్తోంది. ఇక హిందీ శాటిలైట్ రైట్స్ కూడా భారీ మొత్తంలోనే ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో ఇండస్ట్రీలో రికార్డు స్థాయిలో వసూళ్లు రాబుడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  

‘లియో’ చిత్రం గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కుతోంది. దళపతి పవర్ లుక్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచుతున్నాయి. ఇక ఈ చిత్రం కూడా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU)లో భాగంగా ఉండబోతుందని ప్రచారం జరుగుతుండం విశేషం. ఈ చిత్రంలో విజయ్ సరసన త్రిష  (Trisha) నటిస్తోంది. అలాగే సంజయ్ దత్, అర్జున్, ప్రియా ఆనంద్, మైస్కిన్, గౌతమ్ వసుదేవ్ మీనన్, మన్సూర్ అలీ ఖాన్, మనోబాలా కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా కాశ్మీర్ షెడ్యూల్ ను కూడా పూర్తి చేసుకుంది చిత్ర యూనిట్. 2023  అక్టోబర్ 19న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. 
 

click me!