
దర్శకుడు రాజమౌళి(Rajamouli)కి ఆర్ ఆర్ ఆర్ మూవీ చాలా ప్రత్యేకం. నందమూరి మెగా కుటుంబాల వారసులైన ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న మూవీ. ఇద్దరు టాప్ స్టార్స్ తో రాజమౌళి కెరీర్ లో మొదటిసారి చేస్తున్న మల్టీస్టారర్. ఇన్ని విశేషాలతో కూడిన ఆర్ ఆర్ ఆర్ అదే స్థాయిలో రాజమౌళిని ఇబ్బంది పెడుతుంది. ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి వచ్చినన్ని అడ్డంకులు ప్రపంచంలో మరో చిత్రం ఎదురుచూసి ఉండదు. ఏడాది వ్యవధిలో ఐదు విడుదల తేదీలు ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
షూటింగ్ దశలో మొదలైన అడ్డంకులు విడుదలకు కూడా కొనసాగుతున్నాయి. ఎట్టకేలకు మార్చ్ 25 ఆర్ ఆర్ ఆర్ (RRR Movie)విడుదల చేస్తున్నామంటూ మేకర్స్ ప్రకటన చేశారు. కాగా ఈ తేదీ ప్రకారం ఆర్ ఆర్ ఆర్ కోసం మరో పెద్ద పరీక్ష ఎదురుచూస్తుంది. సరిగ్గా ఆ సమయానికి విధ్యార్ధులకు పరీక్షా సమయం. అన్ని స్థాయిలలో ఉన్న విద్యార్థులు మార్చ్ లో పరీక్షలకు హాజరు కావలసి ఉంటుంది. కరోనా కారణంగా క్లాసులు అంతంత మాత్రంగా నడుస్తున్నాయి. కాబట్టి సీరియస్ ప్రేపరషన్ లేకుండా పరీక్షలు ఎదుర్కోవడం పిల్లలకు చాలా కష్టం.
ఇక పరీక్షల నేపథ్యంలో తల్లిదండ్రులు పిల్లల సినిమా కోరికను పక్కన పెడతారు. అదేవిధంగా పరీక్షలు పూర్తయ్యే వరకు నో సినిమా అంటారు. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా థియేటర్స్ రాకుండా చేసే ఛాన్స్ పరీక్షలకు ఉంటుంది. అగ్నికి వాయువు తోడైనట్లు ఐపీఎల్ (IPL 2022) కొత్త సీజన్ కి రంగం సిద్ధమైంది. మరికొన్ని కొత్త జట్లు ఎంట్రీ ఇస్తున్న న్యూ ఐపీఎల్ సీజన్ మొత్తం పది జట్లతో సుదీర్ఘ కాలం సాగనుంది. నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఐపీఎల్ ఇస్తున్న నేపథ్యంలో ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోతారు. క్రికెట్ ప్రియులైన భారతీయులకు ఐపీఎల్ అంటే ఎంత క్రేజో తెలిసిందే.
విద్యార్థులకు పరీక్షలు, ఐపీఎల్ వంటి రెండు ప్రధాన అడ్డంకులు ఆర్ ఆర్ ఆర్ కోసం ఎదురు చూస్తున్నాయి. ఈ పరిస్థితులు ఆర్ ఆర్ ఆర్ వసూళ్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపనున్నాయి. అయితే ఈ అంచనాలు వంద శాతం కరెక్ట్ అవుతాయని నమ్మలేము.ఆర్ ఆర్ ఆర్ వసూళ్లపై పరీక్షలు, ఐపీఎల్ ప్రతికూల ప్రభావం చూపుతాయని ఖచ్చితంగా చెప్పలేం. గతంలో కూడా సమ్మర్ కానుకగా విడుదలైన అనేక చిత్రాలు భారీ విజయం సాధించాయి. పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే ఆర్ ఆర్ ఆర్ ని ఆపడం ఎవరి తరం కాదు.
ఇక ఆర్ ఆర్ ఆర్ విధులకు నెల రోజుల సమయం మాత్రమే ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో ఆర్ ఆర్ ఆర్ గ్రాండ్ గా విడుదల కానుంది. ఎన్టీఆర్ (NTR)కొమరం భీమ్ గా నటిస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర చేస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ ట్రైలర్ ద్వారా కథపై స్పష్టత ఇచ్చాడు రాజమౌళి. గోండు జాతికి చెందిన కొమరం భీమ్ బ్రిటీష్ దొరల అరాచకాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు మొదలుపెడతాడు.
బ్రిటీష్ ప్రభుత్వంలో పనిచేసే పోలీస్ అధికారిగా రామ్ చరణ్ (Ram Charan)కనిపించనున్నారు. మొదట్లో భీమ్ ని విభేదించిన అల్లూరి తర్వాత రియలైజ్ కావడంతో పాటు భీమ్ తో చేతులు కలుపుతాడు. బలమైన బ్రిటీష్ రాజ్యంపై వీరి పోరాటం ఎలా సాగించారనేదే ఆర్ ఆర్ ఆర్ చిత్ర కథ.
అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందించగా... డివివి దానయ్య నిర్మించారు. అజయ్ దేవ్ గణ్, శ్రేయా, సముద్ర ఖని కీలక రోల్స్ చేస్తున్నారు.