Sudheer Babu : అన్ లిమిటెడ్ యాక్షన్ తో ‘సుధీర్ బాబు’ నెక్ట్స్ ఫిల్మ్.. అప్డేట్ అందించిన సుధీర్..

Sreeharsha Gopagani   | Asianet News
Published : Feb 12, 2022, 03:00 PM IST
Sudheer Babu : అన్ లిమిటెడ్ యాక్షన్ తో ‘సుధీర్ బాబు’ నెక్ట్స్ ఫిల్మ్.. అప్డేట్ అందించిన  సుధీర్..

సారాంశం

‘శ్రీ దేవి సోడా సెంటర్’ మూవీతో ఆడియెన్స్ అలరించిన హీరో సుధీర్ బాబు ( Sudheer Babu) ఇప్పటికే ‘ఆ  అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ మూవీలో నటిస్తున్నాడు. ప్రస్తుతం మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తాజాగా ఆ మూవీకి సంబంధించిన అప్డేట్ ను  అందించాడు సుధీర్.   

సూపర్ స్టార్ మహేశ్ బాబు బావమరిది, హీరో సుధీర్‌బాబు ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నాడు. ఇటీవలె శ్రీదేవి సోడా సెంటర్‌ సినిమాతో హిట్‌ అందుకున్న సుధీర్‌బాబు ప్రస్తుతం కృతిశెట్టితో కలసి 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే  ఈ మూవీతో పాటు  డైరెక్టర్ హర్షవర్ధన్‌ దర్శకత్వంలో మరో సినిమాకు సైన్‌ చేశాడు సుధీర్ బాబు.

తాజాగా సుధీర్ 16వ సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ని అభిమానులతో పంచుకున్నాడు సుధీర్. మహేష్ సురపనేని దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ భవ్య క్రియేషన్స్‌లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి  ‘గన్స్ డోంట్ లై’ అనే ట్యాగ్‌లైన్‌తో పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. చుట్టూ తుపాకులు, పోలీస్ స్పెషల్ క్రైమ్స్ డివిజన్ అనే లోగోతో పోస్టర్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఈ చిత్రానికి వి ఆనంద్ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. హీరోయిన్‌, ఇతర నటీనటుల వివరాలు, పూర్తి చిత్ర యూనిట్ వివరాలు త్వరలోనే విడుదల చేయనున్నారు.

 

కాగా, మోహన క్రిష్ణ ఇంద్రగంటి తెరకెక్కిస్తున్న ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమాలో హీరోగా సుధీర్ బాబు, హీరోయిన్ గా కృతిశెట్టి నటిస్తున్నారు. రోమాంటిక్ కామెడీ తో తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి వస్తున్న అప్డేట్స్ ఆడియెన్స్ కు మూవీ పట్ల ఆసక్తిని పెంచుతున్నాయి.  ఇప్పటికే రిలీజైన టీజర్, ఫస్ట్ సింగిల్ ‘కొత్త కొత్తగా’ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.  ‘బెంచ్ మార్క్ స్టూడెయోస్’ మరియు మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. మహేంద్ర బాబు, కిరణ్ బల్లపల్లి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. సినిమాటోగ్రఫీ కోసం పీ.జీ వింద పనిచేస్తున్నారు. వివేక్ సాగర్ సరికొత్త మ్యూజిక్ ను అందిస్తున్నారు. 

మంచి ఫిట్ నెస్ ను సొంతం చేసుకున్న హీరో సుధీర్ బాబు యాక్షన్ సీన్లను పండించడంలో మేటీ. బాలీవుడ్ తారలకు సమానంగా తన ఫిట్ నెస్ మెయింటేయిన్ చేస్తున్నాడు. ప్రస్తుతం రానున్న సుధీర్ 16లో మంచి మాస్ ఎలమెంట్స్ తో పాటు, యాక్షన్ చూపించేందుకు కూడా సిద్ధమయ్యాడు సుధీర్ బాబు. గతంలో ‘బాగీ’ మూవీలో యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్ తో కలిసి మార్షల్ ఆర్ట్స్ ఫైట్ సీన్లలో నటించాడు సుధీర్. ప్రస్తుతం ‘అన్ లిమిటెడ్ యాక్షన్’ను చూపించేందుకు తన నెక్ట్స్ మూవీతో రానున్నాడు.  

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?