
ప్రభాస్ హీరోయిన్, బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకునే ‘గెహ్రైయాన్’లో బోల్డ్ గా నటించించి అందరినీ షాక్ కు గురిచేసింది. సిద్దాంత్ చతుర్వేదితో కలిసి ముద్దు సీన్లలతో రెచ్చిపోయింది. ఇందుకు తన భర్త రణ్ వీర్ సింగ్ మొదటి సారి ఈ మూవీ గురించి స్పందించారు. గెహ్రైయాన్ మూవీలో ఆమె నటనకు అతను ఆశ్చర్యపోయాడు. నిన్ననే ఈ మూవీ అతిపెద్ద ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయ్యింది. ఈ మూవీని చూసిన రణ్ వీర్ సింగ్ దీపిక పదుకునే నటించిన పాత్రపై ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఈ మూవీలో దీపికా పదుకునే అద్భుతంగా నటించిందంటూ కొనియాడారు. గెహ్రైయాన్ మూవీలోని ‘దూబే’ సాంగ్ కు సంబంధించిన పంక్తులు "దూబే... హాన్ దూబే...ఏక్ దూజే మే యహాన్’ ను క్యాప్షన్ గా పెడుతూ.. సముద్రపు ఒడ్డు బీచ్ లో దీపికా పదుకునే, రణ్ వీర్ లిక్ లాక్ చేసుకునే ఫొటోను ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. దీపికా నటనపై స్పందిస్తూ ‘అత్యద్భుతమైన మరియు ఉత్కృష్టమైన ప్రదర్శనిచ్చింది. ఆ రోల్ ఎంతో చక్కటి, సూక్ష్మమైన మరియు హృదయపూర్వకమైన కళాత్మకతను కలిగి ఉంది’ అంటూ పేర్కొన్నాడు.
సాయిబల్ ఛటర్జీ కూడా దీపికా పదుకునే నటన అత్యుత్తమ నాణ్యతతో ఉందని రణ్‌వీర్ సింగ్‌తో ఏకీభవించారు. "దీపిక తన పాత్రను నీళ్ళకు చేపలాగా తీసుకుంటుంది, చిత్రంలో తన ఉనికిని చాటుకుంది’ అంటూ తన అభిప్రాయాన్ని కూడా వ్యక్తం పరిచాడు.
అయితే గతంలో ఈ మూవీలోని ముద్దు సీన్లకు నీ భర్త పర్మిషన్ తీసుకున్నావా అంటూ నెటిజన్ అడిగిన ప్రశ్నకు కూడా బదులిచ్చింది. తాను సోషల్ మీడియాలో వచ్చే కామెంట్లని అస్సలు చదవనని, `నా సినిమాల గురించి నా భర్తతో చర్చిస్తానా లేదా అనేది నా వ్యక్తిగత విషయం. ఇలాంటి వ్యాఖ్యలు చేసినవారు చాలా తెలివి తక్కువ వారు అనిపిస్తుంది. అదే సమయంలో వారు చిన్న చిన్న విషయాల పట్ల ఎక్కువగా ఆలోచిస్తున్నారనిపిస్తుంది` అని సదరు నెటిజన్‌కి మరో ఛాన్స్ లేకుండా చేసింది. దీంతో దీపికాపై ఇలాంటి కామెంట్ చేయాలనుకునే వారికి కూడా గట్టి కౌంటర్ ఇచ్చింది దీపికా.