శంకరాభరణం సినిమాకు మరో అరుదైన గౌరవం, కళా తపస్వి విశ్వనాథ్ కు అంతర్జాతీయ ఖ్యాతి

By Mahesh JujjuriFirst Published Nov 22, 2022, 11:57 AM IST
Highlights

దాదాపు 42 ఏళ్ల తరువాత తెలుగు జాతి గర్వించదగ్గ సినిమా శంకరాభరణం సినిమాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయంగా ఈసినిమాకు గుర్తింపు లభించింది. 

దాదాపు 42 ఏళ్ల తరువాత తెలుగు జాతి గర్వించదగ్గ సినిమా శంకరాభరణం సినిమాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయంగా ఈసినిమాకు గుర్తింపు లభించింది. 

కళాతపస్వి విశ్వనాథ్ ఆలోచనల నుంచి ఉద్భవించి.. వెండితెనపై ప్రేక్షకుల నిరాజనాలు అందుకున్న సినిమా శంకరాభరణం. ఈ సినిమా అప్పట్లో ఎన్నో రికార్డ్స్ ను క్రియేట్ చేసింది. ఏదో ఒక రకంగా ఈ సినిమా తెలుగు జాతిని తలెత్తుకునేలా చేస్తూనే ఉంది. సంగీతం, నృత్యం ప్రధానాంశాలుగా వచ్చిన ఈసినిమా ఎప్పటికీ అలా నిలిచిపోయంది. తెలుగు చిత్ర పరిశ్రమా అంటే వెంటనే గుర్తుకు వచ్చే సినిమాల్లో శంకరాభరణం కూడా ఒకటి. అలాంటి సినిమాకు ఇన్నేళ్లకు  అంతర్జాతీయ ఖ్యాతి లభించింది.  

 గోవాలో జరుగుతున్న53వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవ వేడుకల్లో రీస్టోర్‌డ్‌ ఇండియన్‌ క్లాసిక్‌ విభాగంలో శంకరాభరణం ఎంపికైంది. దీంతో గోవాలో ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. నేషనల్ ఫిల్మ్ అర్చివ్స్ ఆఫ్ ఇండియా వారు మన దేశంలోని గొప్ప చిత్రాలను డిజిటలైజ్‌ చేసి ప్రదర్శించనున్నారు. ఇందులో అన్ని భాషల నుంచి సినిమాలు తీసుకోగా.. మన తెలుగు నుంచి  శంకరాభరణం సినిమాకు చోటు కల్పించారు.   

కళాతపస్వీ విశ్వనాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ  సినిమాను  పూర్ణోదయా క్రియేషన్స్ పతాకంపై ఏడిద నాగేశ్వరరావు నిర్మించారు. జె.వి. సోమయాజులు, మంజుభార్గవి, అల్లు రామలింగయ్య ముఖ్యపాత్రలు పోషించారు. కె. వి. మహదేవన్ అందించిన సంగీతం ఇప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉంది.  1980లో విడుదలైన ఈ సినిమా  కమర్షియల్ హంగులు లేకున్నా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఒక ఏజ్ బార్ ఆర్టిస్ట్ ను హీరోగా పెట్టి..  కథా బలంతో సూపర్ డూపర్ హిట్ సినిమా చేయవచ్చు అని నిరూపించారు విశ్వనాథ్. 

అప్పటి వరకూ కమర్షియల్ హీరోల వెంట పడుతున్న మన ఇండస్ట్రీ నుంచి.. కాస్త ప్రయోగాత్మక సినిమాలు స్టార్ట్ అయ్యాయి. 
అప్పట్లో దేశ వ్యాప్తంగా ఈసినిమా సంచలనం సృష్టించింది. ఇక గోవాలో  జరగబోతున్న ఈ చిత్ర ప్రదర్శనకు నిర్మాత ఏడిద నాగేశ్వరరావు కుమారుడు ఏడిద రాజా ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరుకానున్నారు.

click me!