బాస్ పార్టీ సాంగ్ ప్రోమో... వాల్తేరు వీరయ్య కోసం దేవిశ్రీ ఊరమాస్ బీట్స్!

By Sambi ReddyFirst Published Nov 22, 2022, 11:48 AM IST
Highlights

వాల్తేరు వీరయ్య సంక్రాంతి విడుదలకు సిద్దమవుతుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ షురూ చేశారు. ఇప్పటికే టీజర్ విడుదల చేసిన చిత్ర యూనిట్ ఫస్ట్ సింగిల్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. 
 

మెగాస్టార్ చిరంజీవి జోరు మామూలుగా లేదు. ఆయన నెలల వ్యవధిలో చిత్రాలు విడుదల చేస్తున్నారు. సైరా తర్వాత వరుసగా చిత్రాలు ప్రకటించిన చిరంజీవి చకచకా పూర్తి చేసి విడుదల చేస్తున్నారు. ఆచార్య విడుదలైన ఏడు నెలలకు గాడ్ ఫాదర్ థియేటర్స్ లోకి తీసుకొచ్చారు. మరో రెండు నెలల్లో వాల్తేరు వీరయ్యగా సంక్రాంతి బరిలో దిగుతున్నారు. దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న వాల్తేరు వీరయ్య చిత్రంపై భారీ అంచనాలున్నాయి. చాలా కాలం తర్వాత చిరు అవుట్ అండ్ అవుట్ మాస్ రోల్ చేస్తున్నారు. 

మైత్రి మూవీ మేకర్స్ భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. రవితేజ కీలక రోల్ చేయడం మరో విశేషం. వాల్తేరు వీరయ్యలో రవితేజ రోల్ చాలా ప్రత్యేకం కానుంది. ఎప్పుడో అన్నయ్య మూవీలో రవితేజ చిరంజీవి చిత్రంలో నటించారు. మళ్ళీ ఇన్నేళ్లకు కలిసి వెండితెరపై కనిపించనున్నారు. సవతి తల్లులకు పుట్టిన అన్నదమ్ములుగా చిరంజీవి-రవితేజ కనిపిస్తారనే ప్రచారం జరుగుతుంది.  శృతి హాసన్ మొదటిసారి చిరంజీవితో జతకడుతున్నారు. 

కాగా దీపావళి కానుకగా వాల్తేరు వీరయ్య ఫస్ట్ లుక్ టీజర్ విడుదల చేశారు. నవంబర్ 23 సాయంత్రం 4:05 నిమిషాలకు ఫస్ట్ సింగిల్ విడుదల చేస్తున్నారు. 'బాస్ పార్టీ' అనే ఈ ఫస్ట్ సింగిల్ కి సంబంధించిన టీజర్ నేడు వదిలారు. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రాతెలా ఐటెం నెంబర్ లో నటిస్తున్నారు. బాస్ పార్టీ.. సాంగ్ లో చిరుతో ఆమె స్టెప్స్ వేస్తున్నట్లు సమాచారం. దేవిశ్రీ మ్యూజిక్ అందించిన 'బాస్ పార్టీ' సాంగ్ ని సింగర్స్ నాకాష్ అజీజ్, హరిప్రియ, దేవిశ్రీ పాడారు. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి 2023 సంక్రాంతికి పోటీపడనున్నాయి.  
 

click me!