ఐసీయూలో నటుడు అబ్బాస్... ఆందోళనలో అభిమానులు! 

Published : Nov 22, 2022, 11:19 AM IST
ఐసీయూలో నటుడు అబ్బాస్... ఆందోళనలో అభిమానులు! 

సారాంశం

నటుడు అబ్బాస్ ఆసుపత్రి బెడ్ పై ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో ఆయనకు ఏమైందనే ఆందోళన అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఒక సర్జరీ కోసం ఆయన ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం.   


నటుడు అబ్బాస్ ఆసుపత్రి బెడ్ పై ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చేతికి సెలైన్స్, ఆక్సిజన్ ట్యూబ్స్ తో ఐసీయూలో ఉన్న అబ్బాస్ ని చూసి అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు ఏమైందని ఆవేదన చెందుతున్నారు. అయితే భయపడాల్సిన అవసరం ఏమీ లేదని, ఆయన ఓ సర్జరీ కోసం ఆసుపత్రిలో చేరారని సమాచారం అందుతుంది. 

కొద్దిరోజుల క్రితం అబ్బాస్ బైక్ యాక్సిడెంట్ కి గురయ్యారట. దాంతో ఆయన మోకాలికి గాయమైంది. ఆ గాయం ఇబ్బంది పెడుతుండగా వైద్యులు సర్జరీ సూచించారట. వైద్యుల సలహా మేరకు ఆయన మోకాలి సర్జరీ చేయించుకుంటున్నారనేది విశ్వసనీయ సమాచారం. అబ్బాస్ ఆసుపత్రిలో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో రావడంతో అది కాస్తా వైరల్ గా మారింది. అభిమానుల ఆందోళనకు కారణమైంది. 

ప్రేమదేశం మూవీతో అబ్బాస్ వెండితెరకు పరిచయమయ్యారు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో అబ్బాస్ కి హీరోగా పలు ఆఫర్స్ వచ్చాయి. ఒక దశలో లవర్ బాయ్ ఇమేజ్ అబ్బాస్ ఎంజాయ్ చేశాడు. అయితే ఆయన కెరీర్ త్వరగా ఫేడ్ అవుట్ అయ్యింది. సెకండ్ హీరో ఛాన్సులకు పరిమితమయ్యాడు. 2015 తర్వాత ఆయన సిల్వర్ స్క్రీన్ కి దూరమయ్యాడు. రెండు తమిళ సీరియల్స్ లో సైతం నటించాడు. అబ్బాస్ భార్య ఇరుమ్ అలీ ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్. కుటుంబంతో పాటు అబ్బాస్ విదేశాల్లో సెటిల్ అయినట్లు సమాచారం. 

PREV
click me!

Recommended Stories

అఖండ-2లో బాలయ్య కూతురిగా ఫస్ట్ ఛాయస్ స్టార్ హీరో కూతురట.. ఆమె ఎవరో తెలుసా.?
Jinn Movie Review: జిన్‌ మూవీ రివ్యూ.. హర్రర్‌ సినిమాల్లో ఇది వేరే లెవల్‌